బన్నీ - వక్కంతం వంశీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. ఈ చిత్రం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ఔట్ పుట్ చాలా బాగా వస్తోందట. లవ్, దేశభక్తి ప్రధానాంశంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. యాక్షన్ సీన్స్, దేశభక్తి ఉప్పొంగే డైలాగులు చాలా బాగా వచ్చాయనీ చిత్ర యూనిట్ నుండి అందిన సమాచారమ్. అలాగే హీరో బన్నీ- హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ మధ్య సాగే లవ్ ట్రాక్‌ని చాలా పర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేశారట. ప్రముఖ రచయితగా పాపులరైన వక్కంతం వంశీ మెగాఫోన్ పట్టి తెరకెక్కిస్తున్న చిత్రమే 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'.
తొలి ప్రయత్నంలోనే వక్కంతం వంశీ డైరెక్టర్‌గా ఆకట్టుకోవాలన్న గట్టి కసితో ఉన్నాడనీ తెలుస్తోంది. ఇంతవరకూ రైటర్స్ నుండి డైరెక్టర్స్‌గా ప్రమోట్ అయిన వారిలో కొరటాల శివ దర్శకుడిగా హిట్స్ మీద హిట్స్ కొడుతున్నాడు. ప్రెస్టీజియస్ మూవీస్‌లో పాపులర్ డైరెక్టర్స్ రేంజ్‌లో ఒకడిగా ఉన్నాడు. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా రైటర్ డిపార్ట్‌మెంట్ నుండి వచ్చి డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నవాడే. అలాగే వారి బాటలో వక్కంతం వంశీ కూడా చేరాలని యోచిస్తున్నాడట. అందుకే తొలి ప్రయత్నాన్ని ఆషామాషీగా కాకుండా, చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకున్నాడనిపిస్తోంది.
'డీజె - దువ్వాడ జగన్నాధమ్' సినిమాతో నిరాశ పరిచిన బన్నీ కూడా ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడట. ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఈ ఇద్దరూ ఉన్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ విడుదలైన ఈ సినిమా ప్రోమోస్ అంచనాల్ని పెంచేస్తున్నాయి. పాటల పరంగా కూడా విడుదలైన రెండు పాటలూ దేనికవే ప్రత్యేకంగా ఉన్నాయి. టోటల్‌గా వంశీ పనితనం, బన్నీ నమ్మకం చూస్తుంటే 'సూర్య' బ్లాక్ బస్టర్ ఖాయమనిపిస్తోంది.