అదేంటి.? 'మణికర్ణిక' సినిమా డైరెక్టర్ క్రిష్ కదా అనుకుంటున్నారా? అవును ఆయనే. కానీ ఈ సినిమాకి సంబంధించి ఓ కొత్త వివాదం తెరపైకి వచ్చింది.
'మణికర్ణిక'లో టైటిల్ రోల్ పోషిస్తోన్న బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సెట్స్‌లో క్రిష్‌కి వేల్యూ లేకుండా చేస్తోందట.. దాంతో క్రిష్ అసంతృప్తికి గురయ్యాడట.. ప్రతీ సీన్లోనూ, ప్రతీ షాట్‌లోనూ కంగనా ఓవరాక్షన్ చాలా ఎక్కువైపోయిందనీ, పదే పదే రీ షూట్స్‌కి వెళ్తోందనీ, అది క్రిష్‌కి అస్సలు నచ్చడం లేదనీ, ఆ రకంగా ఈ సినిమా చిత్రీకరణలో క్రిష్ తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నాడనీ గత కొంత కాలంగా గాసిప్స్ వస్తున్నాయి.
తాజాగా ఆ గాసిప్స్‌ని కొట్టిపారేస్తూ కంగనా ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ సినిమాకి దర్శకుడు క్రిష్. కేవలం తాను నటిని మాత్రమే అంతకు మించి ఈ సినిమాలో తన జోక్యం ఏమీ లేదు.. అని కంగనా చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఈ సినిమాకే కాదు, ఏ సినిమా విషయంలోనూ తాను జోక్యం చేసుకోననీ, నా ఈ సక్సెస్‌కి అదే కారణమనీ కంగనా చెప్పింది. కథ ఒప్పుకునే ముందు మాత్రం తనకు ఆ కథ నప్పుతుందా లేదా అని ఆలోచిస్తాను. కొన్ని సూచనలు చేస్తాను అంతే తప్ప ఒక్కసారి సెట్స్‌పైకి వెళ్లాక నటన తప్ప, ఇంకే విషయంలోనూ జోక్యం చేసుకోను.. అని కంగనా ఫుల్‌గా క్లారిటీ ఇచ్చేసింది.
కంగనా స్టేట్మెంట్తో ఈ గాసిప్స్‌కి చెక్ పడుతుందో లేదో చూడాలిక.