కంగనా కాస్త తగ్గిందిలే.!

మరిన్ని వార్తలు

'మణికర్ణిక' డైరెక్టర్‌ని నేనే అంటూ ప్రచారం చేయించుకున్న ముద్దుగుమ్మ కంగనా రనౌత్‌ ముంబయ్‌ నుండి హైద్రాబాద్‌కి వచ్చేసరికి మనసు మార్చేసుకుంది. ప్రత్యేక పరిస్థితుల్లోనే దర్శకత్వం వహించాల్సి వచ్చిందనీ, క్రిష్‌ వదిలి వెళ్లగా మిగిలిన కొద్ది భాగాన్ని మాత్రమే దర్శకురాలిగా తాను పూర్తి చేశానని కంగనా రనౌత్‌ చెప్పింది. 'మణికర్ణిక' తెలుగు వెర్షన్‌ ప్రమోషన్‌ కోసం కంగనా హైద్రాబాద్‌కి వచ్చింది. 

 

క్రిష్‌ని ఎందుకు పక్కన పెట్టారు అన్న ప్రశ్నలు తలెత్తకుండా జాగ్రత్త పడింది. క్రెడిట్‌ క్రిష్‌ ఖాతాలోనే వేసింది. అయితే దాదాపుగా క్రిష్‌ 'మణికర్ణిక' సినిమాని పూర్తి చేసేశాడు. కానీ కంగనా చాలా కీలక మార్పులు చేసింది. రీ షూట్స్‌ చేపట్టింది. ఇవన్నీ మనకి సినిమాలో కనిపించబోతున్నాయి. అయితే తెలుగు వెర్షన్‌కి క్రిష్‌ ఇమేజ్‌ అవసరం కాబట్టి, క్రెడిట్‌ని ఆయనకివ్వడానికి కంగనా వెనుకాడలేదు. నిజానికి కంగనాతో సర్టిఫికెట్‌ ఇప్పించుకునే స్థితిలో క్రిష్‌ లేడు. 

 

కంగనా తెలుగులో 'ఏక్‌నిరంజన్‌' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. పూరీ జగన్నాధ్‌ దర్శకత్వంలో ప్రబాస్‌ హీరోగా వచ్చిన సినిమా అది. ఆ సినిమా టైంలోనే కంగనా తీరుపై విమర్శలొచ్చాయి. ఇక 'మణికర్ణిక' విషయానికి వస్తే స్వాతంత్య్ర సమరయోధురాలు ఝాన్సీరాణి లక్ష్మీభాయ్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది 'మణికర్ణిక'. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS