పవన్‌కీ వరుణ్‌కీ అదే తేడా..!

మరిన్ని వార్తలు

గతంలో పవన్‌ కళ్యాణ్‌, వెంకటేష్‌ మల్టీ స్టారర్‌గా 'గోపాల గోపాలా' చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. మంచి విజయం అందుకుంది కూడా ఆ సినిమా. అయితే ఆ సినిమాలో నటించిన వీరిద్దరూ సీనియర్‌ స్టార్లే. పోటీ పడి నటించారు. ఇప్పుడు అదే మెగా కాంపౌండ్‌ హీరో వరుణ్‌తేజ్‌తో వెంకటేష్‌ నటిస్తున్న మరో మల్టీ స్టారర్‌ 'ఎఫ్‌ 2'. 

 

వరుణ్‌తో పోల్చితే వెంకీకి నటనలో అనుభవం చాలా ఎక్కువ. పర్సనాలిటీ పరంగా వెంకీ, వరుణ్‌కి ధీటుగా మేకోవర్‌ అయ్యాడు. తన గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమాలో వెంకీ స్లిమ్‌గా, హ్యాండ్‌సమ్‌గా యూత్‌ఫుల్‌ లుక్స్‌తో కనిపిస్తున్నాడు. ఇక వెంకీ యాక్టింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కామెడీ టైమింగ్‌, ఎమోషనల్‌ టచ్‌ అన్నింట్లోనూ టాప్‌ లెవలే. అందుకే పక్కా ఫ్యామిలీ హీరోగా వెంకీకి మంచి ఫాలోయింగ్‌ ఉంది. 

 

ఇక వరుణ్‌ విషయానికి వస్తే, స్టార్‌డమ్‌ పరంగా తక్కువే అయినా, వెంకీతో పోటీ పడి నటించేందుకు చేసిన సాహసాన్ని మాత్రం మెచ్చుకొని తీరాల్సిందే. తనకింతవరకూ టచ్‌ లేని కామెడీ యాంగిల్‌ని టచ్‌ చేసి, వెంకీని మ్యాచ్‌ చేయడానికి వరుణ్‌ చేసిన ప్రయత్నం చాలా గొప్పగా ఉందని చిత్ర యూనిట్‌ చెబుతోంది. మెగా కాంపౌండ్‌లో వరుణ్‌కి విలక్షణ హీరో అనే ఇమేజ్‌ ఉంది.

 

ఇక ఎంటర్‌టైన్‌మెంట్‌ని బేస్‌ చేసుకుని రూపొందిన 'ఎఫ్‌ 2'లో వెంకీ డామినేషన్‌ని తట్టుకుని వరుణ్‌ ఎలా పర్‌ఫామ్‌ చేశాడో తెలియాలంటే మరి కొద్ది రోజులు మాత్రమే ఆగాలి. జనవరి 12న 'ఎఫ్‌ 2' ప్రేక్షకుల ముందుకు రానుంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS