పెరిగిన బరువును తగ్గించుకోవడం కోసం, లేదా, ఎప్పుడూ ఫిట్‌గా ఉండడం కోసమో వర్కవుట్స్ చేస్తుంటారు ముద్దుగుమ్మలు. కానీ, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మాత్రం బరువు పెరిగేందుకు ఫీట్లు చేస్తోంది. గతంలో 'సైజ్‌జీరో' కోసం అనుష్క చాలా బరువు పెరిగిన సంగతి తెలిసిందే. ఆ బరువును దించుకోలేక అనుష్క పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉంది. అయినా కానీ, మునుపటి ఫిట్‌నెస్‌ని పొందడంలో అనుష్క హండ్రెడ్ పర్సంట్ సక్సెస్ అయ్యిందని చెప్పలేకపోతున్నాం. ఇక ఇప్పుడు బాలీవుడ్ క్వీన్ కూడా ఇదే సాహసం చేయబోతోంది.
క్వీన్ కంగనా ప్రధాన పాత్రలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 'తలైవి' అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమా కోసం కంగనా చాలా కష్టపడుతోందట. ఏ సినిమా కోసమైనా ఫూర్తి అఫర్ట్ పెట్టి, పాత్రకు జీవం పోసే అతి కొద్ది మంది నటీమణుల్లో కంగనా ఒకరు. జయలలితలా తనను మార్చుకోవడమంటే అంత ఆషామాషీ విషయం కాదు. ముఖ్యంగా ఆ పాత్రకు బరువు బాధ్యత కీలకం. ఆ తర్వాత హావభావాలు, ఆమెలా మాట్లాడగలగడం.. ఇలా చాలానే ఉన్నాయి. వాటిన్నింటినీ ఒంట పట్టించుకోవడం కోసం కంగనా దాదాపు 4 నెలల సమయం అడిగిందట. తమిళ భాషను కష్టపడి నేర్చుకుంటోందట. జయలలితకు సంబంధించి, కొన్ని వీడియోలు చూసి, ఆమెను ఆనుకరించడమెలాగో ప్రాక్టీస్ చేస్తోందట. ఇంతకు ముందెన్నడూ లేని సవాళ్లను ఈ సినిమా కోసం కంగనా ఎదుర్కొంటోందని బాలీవుడ్ సమాచారం. ఈ హోమ్ వర్స్క్ అన్నీ కంప్లీట్ చేసి, వచ్చే ఏడాదిలో ఈ సినిమాని పట్టాలెక్కించనుంది ఐరెన్ లేడీ కంగనా రనౌత్.