గౌతమీ పుత్ర శాతకర్ణి తో తెలుగు సినిమా స్థాయిని ఒక మెట్టు ఎక్కించిన క్రిష్, ఇప్పుడు ఏకంగా భారతదేశ స్థాయిని పెంచే సినిమా చేయబోతున్నట్టు వినికిడి.
వివరాల్లోకి వెళితే, రాణి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితాన్ని ఆధారం చేసుకొని ఒక సినిమా తీయబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ని ఎంపిక చేసుకున్నాడట. అలాగే మణికర్ణిక అనే టైటిల్ కూడా ఈ సినిమాకి పెట్టినట్టు సమాచారం.
అయితే ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ మరియు హిందీ బాషల్లో నిర్మించనున్నారు. దీనికి ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ సమకూర్చనున్నారు.
మరి మన క్రిష్ ఈ జీవిత గాధతో ఎలాంటి సంచలనాలు సృష్టించనున్నాడో..