బాలీవుడ్ భామ కంగనా రనౌత్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఫైర్ బ్రాండ్ అన్న బ్రాండే. అవును మరి, కంగనాతో పెట్టుకుంటే అంతే సంగతి. వివాదాలతో సావాసం చేస్తూ, ఎప్పుడూ వార్తల్లో మెయిన్ అట్రాక్షన్ అవ్వాలనుకునే కంగనాకి పెళ్లీడు వచ్చిందని ఇప్పటికి గుర్తొచ్చినట్లుంది. నాకూ పెళ్లి చేసుకోవాలనుంది అని చెబుతోంది. అయితే, తనకు కాబోయే భర్త మాత్రం తన కన్నా తెలివిగలవాడు అయ్యి ఉండాలట. అలాగే మంచి టాలెంట్ ఉన్నోడు కావాలట.ఈ క్వాలిటీస్‌తో ఉన్న మంచి కుర్రోడు దొరికితే, తాను పెళ్లికి రెడీ అంటోంది క్వీన్ కంగనా.
ఇంతకీ కంగనాకి పెళ్లి ఆలోచన ఎందుకు వచ్చిందో తెలుసా.? ఆమె నటిస్తున్న తాజా చిత్రం 'పంగా' కారణంగా అట. ఈ సినిమాకి దర్శకత్వం వహించింది ఓ లేడీ డైరెక్టర్. రితేష్ తివారీ సతీమణి అయిన అశ్వినీ అయ్యర్ తివారీ 'పంగా' చిత్రానికి దర్శకురాలు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఈ ఇద్దరి భార్యా భర్తల మధ్య స్నేహం, ప్రేమానుబంధం చూసి కంగనా పులకించిపోయిందట. వారి వైవాహిక బంధం చూశాకే తనకీ పెళ్లిపై మంచి అభిప్రాయం కలిగిందనీ ఆ సందర్భంగానే తనకు కాబోయే భర్త ఎలా ఉండాలన్న దానిపై ఈ అభిప్రాయానికి వచ్చానని కంగనా చెప్పుకొచ్చింది. మగవాళ్లంటేనే చిర్రెత్తుకొచ్చే కంగనా దృష్టి పెళ్లి వైపు మళ్లడం, కాబోయే భర్త క్వాలిటీస్ గురించి చెప్పడం.. ఇదంతా చూస్తుంటే, ఆమె ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ కూడా షాకవుతున్నారు. ఏది ఏమైతేనేం, కంగనాలో వచ్చిన ఈ మార్పు త్వరలోనే ఆమెని ఓ ఇంటిదాన్ని చేస్తుందేమో చూద్దాం.