రిలీజ్‌ ఓకే.. రిజల్ట్‌ సంగతేంటీ కంగనా..!

By iQlikMovies - May 11, 2019 - 18:30 PM IST

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌గా పేరొందిన కంగనా రనౌత్‌కీ, గ్రీకువీరుడు హృతిక్‌ రోషన్‌కీ మధ్య చిలికి చిలికి గాలి వానలా మొదలైన వివాదం తుఫాన్‌గా మారుతోన్న సంగతి తెలిసిందే. అయితే, అనవసరంగా కంగనాతో పెట్టుకోవడం ఎందుకులే అన్నట్లుగా హృతిక్‌ రోషన్‌ అన్నింటికీ వెనక్కి తగ్గి విజ్ఞతతో మెలగుతున్నారు. జూలై 26న హృతిక్‌ రోషన్‌ నటించిన 'సూపర్‌ 30' చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

 

అయితే అదే డేట్‌ని కంగనా తాజా చిత్రం 'మెంటల్‌ హై క్యా' కోసం ఫిక్స్‌ చేసుకుంది. స్టార్‌డమ్‌ పరంగా కంగనా స్టార్‌ హీరోలతో ఈక్వెల్‌ రేంజ్‌లో ఓ వెలుగు వెలుగుతోంది. అలా ఈ రెండు సినిమాలూ పెద్ద సినిమాల కిందే లెక్క. అయితే, ఒక మెట్టు దిగి, కంగనా కోసం హృతిక్‌ తన సినిమాని వాయిదా వేసుకోవడానికి ముందుకొచ్చాడు. అంటే జూలై 26న కంగనా నటిస్తున్న 'మెంటల్‌ హై క్యా' సినిమా మాత్రమే సోలోగా విడుదలవుతోందన్న మాట. అయితే ఈ పరిస్థితిని కంగనా అడ్వాంటేజ్‌గా తీసుకుంది. ఈ విషయమై హృతిక్‌ ఫ్యాన్స్‌ కంగనాని ఆడిపోసుకుంటున్నారు సోషల్‌ మీడియా వేదికగా. అయినా కంగనాకి ఇదేం కొత్త కాదు. గతంలోనూ 'మణికర్ణిక' టైంలో ఇలాగే జరిగింది. నిజానికి 'సూపర్‌ 30' సినిమా జనవరి 26న రిపబ్లిక్‌ డే సందర్భంగా విడుదల కావల్సి ఉంది.

 

కానీ ఆ టైంలో 'మణికర్ణిక' కోసం తన సినిమాని పోస్ట్‌పోన్‌ చేశాడు హృతిక్‌. ఇప్పుడు రెండోసారీ అదే పరిస్థితి. అయితే అదే సెంటిమెంట్‌ వర్కవుట్‌ అయ్యి, 'మణికర్ణిక'లాగా, 'మెంటల్‌ హై క్యా' రిజల్ట్‌ కూడా రివర్స్‌ గేర్‌ వేస్తుందేమో అనే అనుమానాలున్నాయి. చూడాలి మరి, రిలీజ్‌ డేట్‌ విషయంలో హృతిక్‌తో పోటీపడి, ఎంతమాత్రమూ వెనక్కి తగ్గకుండా, పంతం అయితే నెరవేర్చుకుంది. కానీ రిజల్ట్‌ విషయంలో తన పంతం తీర్చుకుంటుందా.? వేచి చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS