అమితాబ్ సినిమాలో ఛాన్స్ వ‌స్తే వ‌ద్ద‌న్నాడా..?

By iQlikMovies - May 11, 2019 - 10:30 AM IST

మరిన్ని వార్తలు

అమితాబ్‌బ‌చ్చ‌న్‌, ర‌ణ‌బీర్‌క‌పూర్‌, అలియాభ‌ట్‌, నాగార్జున‌.. వీళ్లంతా క‌ల‌సి న‌టిస్తున్న సినిమా 'బ్ర‌హ్మ‌స్త్ర‌'. ఇలాంటి ప్ర‌తిష్టాత్మ‌క చిత్రంలో అవ‌కాశం వ‌స్తే ఎవ‌రైనా కాదంటారా?? వ‌దులుకుంటారా? కానీ సుధీర్ బాబు మాత్రం ఈ ఛాన్స్‌కి మిస్ చేసుకున్నాడు. బ్ర‌హ్మాస్త్ర‌లో ఓ కీల‌క‌మైన పాత్ర‌లో న‌టించే ఛాన్స్ సుధీర్ బాబుకి వ‌చ్చింది. కానీ.. `నో` చెప్పాడు. ఈ విష‌యాన్ని సుధీర్ బాబునే చెప్పుకొచ్చాడు.

 

''బ్ర‌హ్మాస్త్ర‌లో నాకూ ఛాన్స్ వ‌చ్చింది. కానీ.. బాలీవుడ్ సినిమా అంటే చాలా రోజులు వెచ్చించాలి. తెలుగు సినిమాల్ని వ‌దులుకోవాల్సివ‌స్తుంది. అందుకే.. నో చెప్పా'' అంటున్నాడు సుధీర్ బాబు. ప్ర‌స్తుతం నానితో క‌ల‌సి ఓ సినిమాలో న‌టిస్తున్నాడు. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో సుధీర్‌బాబు పోలీస్ గా క‌నిపించ‌బోతున్నాడు. ర‌చ‌యిత హ‌ర్ష‌వ‌ర్థ‌న్ ద‌ర్శక‌త్వంలోనూ సుధీర్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS