మేఘా ఆకాష్‌ కొత్త సినిమా షురూ!

By iQlikMovies - May 11, 2019 - 17:30 PM IST

మరిన్ని వార్తలు

'లై' సినిమాతో తెరంగేట్రం చేసిన మలయాళీ ముద్దుగుమ్మ మేఘా ఆకాష్‌ తాజా చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. 'లై', 'ఛల్‌ మోహన్‌రంగా' చిత్రాలతో వరుసగా నితిన్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత మరో తెలుగు సినిమాలో నటించలేదు. తమిళంలో రజనీకాంత్‌ నటించిన 'పేటా' తదితర కొన్ని సినిమాల్లో నటించింది. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత మళ్లీ తెలుగులో సినిమా ఓకే చేసింది.

 

ప్రముఖ నిర్మాత రాజ్‌ కందుకూరి తనయుడు శివ కందుకూరి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. భరత్‌ కుమార్‌ ఈ సినిమాకి దర్శకుడు. కాగా ఈ సినిమా లాంఛింగ్‌కి చందమామ కాజల్‌ అగర్వాల్‌ స్పెషల్‌ గెస్ట్‌గా విచ్చేసింది. పూజా కార్యక్రమంలో కాజల్‌ సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఇంతకీ మేఘా ఆకాష్‌ సినిమాకి కాజల్‌ స్పెషల్‌ గెస్ట్‌గా ఎందుకొచ్చిందంటే, కాజల్‌ వద్ద మేనేజర్‌గా పని చేస్తున్న రాన్‌సన్‌ ఈ సినిమాకి నిర్మాతగా పని చేస్తున్నారు.

 

ఎన్‌. శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి రాన్‌సన్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సినిమాకి 'మనుచరిత్ర' అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. గోపీ సుందర్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. మరోవైపు కాజల్‌ నటించిన 'సీత' ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS