'సరిలేరూ.. ' ఏంథమ్‌ సాంగ్‌ అంతకు మించి అనేలా.!

By Inkmantra - December 23, 2019 - 17:24 PM IST

మరిన్ని వార్తలు

'సరిలేరు.. నీకెవ్వరూ..' నుండి ఏంథమ్‌ సాంగ్‌ రిలీజ్‌ చేశారు. భారీ మ్యూజిక్‌ బిల్డప్‌తో దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత సారధ్యంలో ఈ సాంగ్‌ రూపుదిద్దుకుంది. వీడియోలో కొత్తగా వదిలిన స్టిల్సేమీ లేవు కానీ, మహేష్‌బాబు ఆర్మీ ఆఫీసర్‌గా గన్ను పట్టుకుని, వెనక భారీగా తరలి వస్తున్న సైన్యంతో కనిపిస్తున్నాడు. షూటింగ్‌ స్పాట్‌లోని కొన్ని మ్యూజిక్‌ క్లిప్పింగ్స్‌ కూడా రిలీజ్‌ చేశారు. వాటిని మించి, దేవిశ్రీ అండ్‌ టీమ్‌ ప్లే చేస్తున్న మ్యూజిక్‌ సెట్‌ అప్‌ని ఎక్కువగా మిక్స్‌ చేశారు వీడియోలో.

భారీ నుండి అతి భారీగా మ్యూజిక్‌ ఆర్కెస్ట్రాని ఉపయోగించి ఈ సాంగ్‌ కంపోజ్‌ చేసినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. శంకర్‌ మహదేవన్‌ గాత్రంలో 'సరిలేరూ.. నీకెవ్వరూ..' అంటూ సాగే ట్యూన్‌, పాటలోని లిరిక్స్‌ దేశభక్తిని పురిగొల్పేలా ఉన్నాయి. ఇప్పటి వరకూ వచ్చిన సాంగ్స్‌ ఓ ఎత్తు. ఈ సాంగ్‌ మరో ఎత్తు అనేలా ఉంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. జనవరి 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS