బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌కి స్టైలింగ్‌లో ఓ స్పెషల్ టేస్ట్ ఉంది. తాజాగా కేన్స్‌కి హాజరయిన కంగనా రనౌత్ డిఫరెంట్ డ్రస్సింగ్‌లో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కేన్స్ రెడ్ కార్పెట్‌పై రాణిలా మెరిసింది. క్రీమ్ కలర్ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసింది.
అచ్చు రాణిని తలపిస్తోంది. డిఫరెంట్ హెయిర్ స్టైల్, అండ్ కళ్లకు కూలింగ్ గ్లాస్‌తో మోడ్రన్ రాణిలా రాజసం చూపించింది. అయితే ఆఫ్టర్ పార్టీ డ్రస్సింగ్‌లో మాత్రం కొంచెం ఎక్కువ చేసింది. రెడ్ కార్పెట్‌పై క్యూట్‌గా మెరిసిన కంగనా, ఆఫ్టర్ పార్టీకి బ్లాక్ అండ్ వైట్ మోడ్రన్ డ్రస్సులో దర్శనమిచ్చింది. ఈ డ్రస్సుపై నెటిజన్స్ రకరకాల కామెంట్లు గుప్పించారు. క్లీవేజ్‌ని పూర్తిగా వదలేసిందనీ, ఆ ఫోటోలు జూమ్ చేసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ఏంటిది కంగనా..? మరీ ఇంతలానా.? అంటూ ట్రోల్ చేశారు. అవును నిజమే, కంగనా డ్రస్సింగ్ అలాగే ఉంది. క్లీవేజ్‌ని పూర్తిగా వదిలేసి, పైన జస్ట్ బ్లాక్ సూట్‌తో ఆ పార్ట్‌ని కవర్ చేసినట్లు కనిపిస్తోంది. కవర్ చేసినా కానీ, దాగనంటోన్న ఆ అందాలను చూసి ఎంజాయ్ చేసేవాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. కామెంట్ చేసేవాళ్లు కామెంట్స్ చేస్తున్నారు.
అయినా ఎలాంటి కామెంట్స్ అయినా మన ఫైర్ బ్రాండ్ పట్టించుకుంటుందా.? నో వే. తిరిగి మళ్లీ కంగనా నోట్లో పడకుండా జాగ్రత్త పడకండి అంటూ కొందరు నెటిజన్స్ వారిలో వారినే స్వీట్‌గా హెచ్చరించుకుంటున్నారు. అవును మరి కంగనా సంగతి తెలిసినవారెవరైనా ఆమె జోలికి పోయే సాహసం చేస్తారా.?