హ్రితిక్-కంగనాల గొడవలో మాటల యుద్ధం

మరిన్ని వార్తలు

హ్రితిక్-కంగనాల మధ్య సాగుతున్న గొడవ ఇప్పుడు హిందీ పరిశ్రమలో ట్రేండింగ్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు వీరి గొడవలో ఇతరుల కామెంట్స్ చర్చనీయాంశంగా మారింది.

ఈ మధ్యనే హ్రితిక్ కి మద్దతుగా ఫర్హాన్ అఖ్తర్, సోనం కపూర్ లు బహిరంగ లేఖలు రాయగా, వీరిని కంగనా చెల్లెలు రంగోలి తీవ్రంగా విమర్శించింది. అసలు నిజాలు తెలియకుండా ఇలా కంగనాది తప్పు అనడం ఎంతవరకు సమంజసం అని ఆమె వారిని ప్రశ్నించింది.

ఇక ఇదే అంశం పైన హ్రితిక్ కి మద్దతు తెలిపిన దర్శకుడు కరణ్ జోహార్ ని సైతం కంగనా చెల్లెలు విమర్శించింది. నిజానిజాలు తెలియకుండా ఇలా ఆరోపణలు చేయడం తగదు అని చెప్పుకొచ్చింది. ఇదే అంశం పై హ్రితిక్ ఈ మధ్యనే ఒక టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.
 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS