బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌కి కరోనా సోకిందట. ఇటీవలే ఇటలీ నుండి వచ్చిన ఈమె, ఆ తర్వాత ఓ ఫంక్షన్‌కి అటెండ్ అయ్యింది. దాదాపు 100 మంది గెస్ట్‌లతో ఆ ఫంక్షన్లో పండగ చేసుకుంది. ఈ మధ్య కాస్త అస్వస్థతగా ఉంటే, కరోనా టెస్ట్ చేయించుకుందట. పోజిటివ్ అని తేలిందట. ఇక అంతే, ఆమెను ఆడుకోవడం మొదలుపెట్టారు నెటిజన్లు. ప్రపంచంలో కరోనా ఈ రేంజ్లో ఉధృతంగా ఉన్న నేపథ్యంలో విదేశాలకు వెళ్లి వచ్చిన చాలా మంది సెబ్రిటీలు స్వీయ క్వారంటైన్లో ఉంటున్నారు. అలాంటిది కనికా కపూర్ చేసిన పనిని అందరూ తప్పు పడుతున్నారు.
తిట్టి పోసేస్తున్నారు. ఇప్పుడు బాధపడి ఏం లాభం. విదేశాల నుండి రాగానే 14 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్లో ఉంటే, బావుండేది. ఇప్పుడు ఆమెతో పాటు ఆ ఫంక్షన్‌కి అటెండ్ అయిన గెస్ట్ల్లో ఎంతమంది కరోనా పాజిటివ్ ఉన్నారు.? అనేది అన్వేషించడం పెద్ద తలనొప్పిగా మారిందట. అదీ సంగతి.