కన్నడ చిత్రపరిశ్రమకి చెందిన యువ నటుడు రాకేశ్ (27) కన్నుమూశారు.
వివరాల్లోకి వెళితే, గత కొంతకాలంగా గ్యాగ్రిన్ వ్యాధితో భాదపడుతున్న ఈ యువ నటుడు ఆ వ్యాధికి సంబందించిన చికిత్స తీసుకుంటున్నాడు. రెండు నెలల క్రితం ఒక శస్త్రచికిత్స కూడా వైద్యులు చేశారు, అయితే ఆ వ్యాధి మళ్ళీ తిరగబెట్టడంతో బెంగళూరులోని సెయింట్ జాన్స్ ఆసుపత్రిలో చేరాడు.
ఇక డాక్టర్లు ఎంత ప్రయత్నించినా, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. రాకేశ్ తల్లిదండ్రులు- ఆశారాణి & నగేష్ లు కూడా కన్నడ చిత్రపరిశ్రమలో ప్రముఖ నటులు.
రాకేశ్ నటించిన తాజచిత్రం ఒకటి షూటింగ్ చివరి దశలో ఉంది. రాకేశ్ అకాల మృతికి కన్నడ చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతి తెలియచేసింది.