'జల్సా' సినిమాలోని ఇంట్రడక్షన్ ఫైట్ తెలుగు సినీ పరిశ్రమలో ఓ సంచలనం. అంత స్టైలిష్‌గా దాన్ని 'డిజైన్' చేశారు. పవన్‌కళ్యాణ్ సినిమాలంటేనే అంత. చాలా అరుదుగా మాత్రమే పవన్ సినిమాల్లో సినిమాటిక్ యాక్షన్ సీక్వెన్సెస్ కన్పిస్తుంటాయి. తొలి సినిమా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' నుంచి ఇప్పటిదాకా పవన్ సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ దేనికదే ప్రత్యేకం. ఎప్పటికీ మర్చిపోలేం వాటిని. త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్‌లో అయితే ఈ ఫైట్స్ ఇంకా స్పెషల్‌గా ఉంటాయి. 'అత్తారింటికి దారేది' సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ గురించి అందరికీ తెలుసు కదా. యాక్షన్ సీక్వెన్సెస్‌లో పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఆ స్టైలిష్ లుక్‌ని పదింతలు చేసి పవన్ కొత్త సినిమాలో చూపించబోతున్నారట. త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా కోసమే అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్‌ని చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్‌ని చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేశారట. ఓ కేఫ్‌లో జరిగే ఫైట్ సన్నివేశమది. మార్షల్ ఆర్ట్స్‌లో పవన్ ప్రావీణ్యం గురించి అందరికీ తెలిసినదే. ఆ ప్రావీణ్యంతోనే ఈ ఫైట్‌లో కొన్ని 'కిక్స్'కి పవన్ తన పరిధి మేర సూచనలు చేసినట్లు తెలియవస్తోంది. ఫైట్ చాలా బాగా వచ్చిందనీ, నభూతో న భవిష్యతి అనే రేంజ్‌లో ఉంటుందని ఇన్‌సైడ్ సోర్సెస్ అంటున్నాయి. పవన్ సరసన ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.