కీరవాణి తనయుడు సింహా కోడూరి డెబ్యూ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. 'మత్తు వదలరా' అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేశారు. టైటిల్, ఫస్ట్‌లుక్‌తో ఆసక్తి బాగానే క్రియేట్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశకు దగ్గరలో ఉన్న ఈ సినిమాకి మన జక్కన్న ఫైనల్ అవుట్ పుట్ ఇస్తున్నట్లు తాజా సమాచారం. జక్కన్న చేతిలో పడిందంటే, ఆ చెక్కుడు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. డెబ్యూ హీరో కాబట్టి, హీరో ఇంట్రడక్షన్, క్లైమాక్స్ సీన్స్ విషయంలో జక్కన్న ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడట.
ఈ సినిమాతో రితీష్ రానా డైరెక్టర్‌గా డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. షార్ట్ ఫిలింస్ డైరెక్షన్ నుండి వచ్చిన రితీష్‌కి ఇదే తొలి చిత్రం కావడంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడట. అంతేకాదు, జక్కన్న సూచనలతో సినిమా మేకింగ్ నెక్స్‌ట్ లెవల్ అందుకోనుందని భావిస్తున్నారు. ఓ వైపు రాజమౌళి తన ప్రెస్టీజియస్ మూవీ 'ఆర్ఆర్ఆర్'తో బిజీగా ఉంటూనే, ఈ చిన్న సినిమా కోసం కూడా చిన్నపాటి టైమ్ కేటాయించడం విశేషం. ఎంతైనా తన సోదరుడి కొడుకు డెబ్యూ మూవీ కదా. అన్నట్లు ఈ సినిమాతోనే కీరవాణి మరో తనయుడు కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్‌గా డెబ్యూ చేస్తున్నాడు. అన్ని పనులు పూర్తి చేసి, ఫిబ్రవరిలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.