జాన్వీ కపూర్‌ బాధ్యతంతా అతనిదేనట

By iQlikMovies - March 27, 2018 - 09:00 AM IST

మరిన్ని వార్తలు

తన కుమార్తెను హీరోయిన్‌గా ప్రమోట్‌ చేయడానికి ఎన్నెన్నో కలలు కనేసి వుంటుంది శ్రీదేవి. దురదృష్టవశాత్తూ ఆమె తన కుమార్తె తెరంగేట్రాన్ని చూడకుండానే అకాల మరణం చెందింది. దాంతో జాన్వీ కపూర్‌ పరిస్థితి దయనీయంగా తయారైపోయింది. తల్లి మరణ వార్తతో కుంగిపోయిన జాన్వీ కోలుకోవడానికి చాలా సమయమే పడ్తుంది. 

అయితే, ముందుగా కమిట్‌ అయిన నేపథ్యంలో 'ధడక్‌' సినిమా షూటింగ్‌కి జాన్వీ హాజరు కాక తప్పడంలేదు. సెట్స్‌లో జాన్వీకి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నాడు నిర్మాత కరణ్‌ జోహార్‌. కపూర్‌ కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఈ సినిమా సెట్స్‌లో జాన్వీకి అండగా వుంటున్నారట. మిగతా వారందరి సంగతెలా వున్నా, కరణ్‌ - జాన్వీకి తోడుగా వుంటున్న విషయం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. దర్శక నిర్మాత అయిన కరణ్‌, హీరోయిన్లను బాగా చూసుకుంటాడని అందరికీ తెలుసు. అయితే ఆయనింత బాధ్యతగా వ్యవహరించడం ఆశ్చర్యకరమే. 

'శ్రీదేవి నాకు చాలా ఇష్టమైన నటి. బోనీ కపూర్‌ కుటుంబంతో విడదీయరాని బంధం నాది. అందుకే, జాన్వీ బాధ్యతను నేను తీసుకున్నా' అని చెబుతున్నాడు కరణ్‌ జోహార్‌. అక్కతోపాటు షూటింగ్‌ స్పాట్‌కి వెళుతున్న ఖుషీ, అక్క డీలాపడిన ప్రతి సందర్భంలోనూ అక్కకి ధైర్యం నూరిపోస్తోందట. జాన్వీ ముందున్న లక్ష్యం ఒక్కటే, తల్లి కోరికను నెరవేర్చడం. 

హీరోయిన్‌గా తాను సక్సెస్‌ అయితే, అది తల్లికి తానిచ్చే ఘన నివాళి అన్న భావనలో వుంది జాన్వీ కపూర్‌. చెల్లెలు ఖుషీది కూడా అదే కోరిక. శ్రీదేవి ట్రెయినింగ్‌ ఎలా వుంటుందో, కరణ్‌ ట్రెయినింగ్‌ కూడా ఖుషీకి అలాగే అన్పిస్తోందట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS