'భరత్‌'లో హీరోయిన్‌గా శ్రద్ధాకపూర్‌!

మరిన్ని వార్తలు

'భరత్‌' సినిమా అనగానే మనం మన తెలుగు సినిమా 'భరత్‌ అను నేను' గురించే మాట్లాడుకుంటాం. ఏప్రిల్‌లో 'భరత్‌ అను నేను' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిపోయి, విడుదలకు సిద్ధమవుతున్న ఈ దశలో, ఈ సినిమాలో హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌ అనే గాసిప్‌ తెరపైకి రావడమేంటట? 

ఇదే కదా, మీ డౌట్‌! అయితే మీరు తప్పులో కాలేసినట్లే. విషయమేంటంటే, ఈ 'భరత్‌' మన తెలుగు సినిమా కాదు. ఇది బాలీవుడ్‌ మూవీ. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా బాలీవుడ్‌లో తెరకెక్కనుంది 'భరత్‌'. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇప్పటికే ప్రియాంకా చోప్రా పేరుని దాదాపు ఖాయం చేశారు. తాజాగా మరో హీరోయిన్‌ పాత్ర కోసం శ్రద్ధా కపూర్‌ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తెలుగులో శ్రద్ధా కపూర్‌ 'సాహో' సినిమాలో నటిస్తోన్న సంగతి తెల్సిందే. 

ప్రభాస్‌ హీరోగా రూపొందుతోన్న 'సాహో' సినిమా షూటింగ్‌కి సంబంధించిన విషయాల్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ టాలీవుడ్‌కీ, బాలీవుడ్‌కీ 'కనెక్షన్‌'లా మారిపోయింది శ్రద్ధా కపూర్‌. టాలీవుడ్‌ సినిమా 'వర్షం'ని హిందీలోకి 'బాఘీ' పేరుతో రీమేక్‌ చేస్తే, అందులో శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటించిన సంగతి తెల్సిందే. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి జోరు చూపిస్తోన్న శ్రద్ధా కపూర్‌, సల్మాన్‌ఖాన్‌ నటిస్తోన్న 'భరత్‌'లో భాగమైతే, ఆమె ఖాతాలో ఓ ప్రెస్టీజియస్‌ మూవీ కానుందన్నది నిర్వివాదాంశం. 

అయితే ఈ విషయమై ఇంకా శ్రద్ధా కపూర్‌ స్పందించలేదు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS