భీష్మ‌కి కొత్త స‌మ‌స్య‌

By Gowthami - February 19, 2020 - 10:30 AM IST

మరిన్ని వార్తలు

మ‌రికొద్ది గంటల్లో నితిన్ - ర‌ష్మిక‌ల సినిమా భీష్మ విడుద‌ల కాబోతోంది. ఈ సినిమాపై మంచి బ‌జ్ ఉంది. పాట‌లు, ప్ర‌చార చిత్రాలూ ఆక‌ట్టుకోవ‌డంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. దాంతో పాటు బిజినెస్ కూడా బాగానే జ‌రిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి ఓ కొత్త స‌మ‌స్య ఎదురైంది. ఈ సినిమా టైటిల్ మార్చాలంటూ ఓ వ‌ర్గం ప‌ట్టుప‌డుతోంది. ఓ సినిమాకి `భీష్మ‌` అనే టైటిల్ పెట్టి, హిందూ ధ‌ర్మాన్ని కించ‌ప‌రుస్తున్నార‌ని, భీష్ముడు ఓ బ్ర‌హ్మ‌చారి అని, హీరోకి ఆ పాత్ర పేరు పెట్టి, అమ్మాయిల వెంట ప‌డేవాడుగా చూపిస్తున్నార‌ని, ఇది హిందూ మ‌నోభావాల‌ను దెబ్బ‌తీయ‌డ‌మే అని, ఎట్టిప‌రిస్థితుల్లోనూ టైటిల్ మార్చాల్సిందే అని, లేదంటే విడుద‌ల కానివ్వ‌మ‌ని హెచ్చరిస్తున్నారు. గ‌తంలో `వాల్మీకి`కి ఇదే స‌మ‌స్య ఎదురైంది. చివ‌రి నిమిషాల్లో `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌`గా మార్చి ఈ సినిమాని విడుద‌ల చేశారు. మ‌రి `భీష్మ‌` ప‌రిస్థితి ఏమిటో..?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS