బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆశక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. రాహుల్ గాంధీతో డేట్‌కి వెళ్లాలని ఉందని కరీనా చెప్పింది. ఆల్రెడీ కరీనాకు పెళ్లయ్యింది. ఒక పిల్లాడు కూడా ఉన్నాడు. సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు కమర్షియల్ యాడ్స్‌తోనూ కరీనా బిజీనే. అయితే రాహుల్‌తో డేట్‌కి వెళ్లాలన్న కరీనా కోరిక ఇప్పుడు సోషల్ మీడియాలో వివాదాస్పదమైంది. అయినా ఇప్పుడు డేటింగ్ అన్న మాట తెగ మార్మోగిపోతోందిలెండి.
నిజానికి ఈ డేటింగ్ అనేది ఇప్పటిది కాదు, విదేశీ సంస్కృతి అయిన డేటింగ్ ఇండియాలో పాగా వేసి చాలా కాలమే అయ్యింది. ఇదే కాన్సెప్ట్‌పై రమ్యకృష్ణ, శ్రీకాంత్ హీరోగా ఓ సినిమా కూడా వచ్చేసింది అప్పట్లో. ఆ సంగతి అటుంచితే, తాజాగా ముద్దుగుమ్మల్ని ఇంటర్వ్యూ చేయాల్సి వస్తే, ఆ ప్రశ్నల్లో ఈజీగా ఈ డేటింగ్ ప్రశ్నను సంధించేస్తున్నారు రిపోర్టర్లు. అలా కొందరు ఫన్నీగా ఈ క్వశ్చన్‌కి ఆన్సర్ చెబుతుంటే, మరికొందరు చెప్పే ఆన్సర్లు సీరియస్‌గానే అనిపిస్తున్నాయి. ఇంకొన్ని వివాదాస్పదం కూడా అవుతున్నాయి.
అయితే తాజాగా కరీనా చెప్పిన సమాధానం విషయానికి వస్తే, అక్కడక్కడా రాహుల్ గాంధీ గురించి చదివి ఆయనపై అమితమైన ఇష్టం పెంచుకుందట. ఆయన గురించి మరింత క్షుణ్ణంగా తెలుసుకోవాలనుందని కరీనా చెప్పింది. కరీనా బయటపెట్టిన ఈ కోరికతో ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో ఆశక్తికరమైన చర్చ జరుగుతోంది. కరీనాకి రాజకీయ ప్రముఖుడు రాహుల్ గాంధీతో డేట్‌కి వెళ్లాలనిపిస్తే, మిల్కీబ్యూటీ తమన్నాకేమో క్రికెటర్ విరాట్ కోహ్లీతో డేట్‌కి వెళ్లాలనిపించిందట. ఏంటో ఈ డేటింగ్స్ గోల.?