'ఝుమ్మంది నాదం' సినిమాతో తెలుగుతెరకు క్యూట్‌గా ఎంట్రీ ఇచ్చిన తాప్సీ ఆ తర్వాత తెలుగులో బాగానే సినిమాలు చేసింది. వెంకీ వంటి స్టార్ హీరోతో కూడా స్క్రీన్ షేర్ చేసేసుకుంది ముద్దు ముద్దుగా. కానీ ఎప్పుడయితే బాలీవుడ్‌లో అడుగుపెట్టిందో అంతవరకూ క్యూట్‌గా కనిపించిన తాప్సీ ఒక్కసారిగా గడుసు పిల్లయిపోయింది. టాలీవుడ్‌పై పలు విమర్శలు చేయడం మొదలుపెట్టింది. అవునండీ మరి, వెళ్లగానే బాలీవుడ్ బాబులు తెగ ఆదరించేశారు తాప్సీని.
ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ ఇచ్చి చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ హోదా కట్టబెట్టేశారు. అయితే ఇప్పుడిప్పుడే తాప్సీ తెలుగులోనూ సినిమాలు ఒప్పుకుంటోందిలెండి. అది వేరే విషయం. హీరోయిన్‌గా వెలగడం అనేది తాత్కాలికం మాత్రమే, పర్మినెంట్‌గా మనకంటూ ఓ గుర్తింపు ఉండాలి అంటోంది తాప్సీ. అందుకే తెరపై స్టార్‌గా వెలుగు వెలుగుతూనే, తెర వెనుక రకరకాల బిజినెస్ వ్యవహారాలు చక్కబెడుతోంది తాప్సీ. ఇవన్నీ కూడా కాదట.
అన్నింటికీ మించి సినిమాల తర్వాత కూడా తనకి ఆ స్థాయిలో ఓ గుర్తింపు ఉండాలంటోంది. అందుకే బ్యాడ్మింటన్ ప్లేయర్ అనిపించుకోవడానికి తెగ కసరత్తులు చేస్తోందట. ఒకవేళ సినిమాల్లో అవకాశాల్లేక, సినిమాలకు పూర్తిగా టాటా బైబై చెప్పేయాల్సి వస్తే, తర్వాత బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా ఫిక్స్ అయిపోతానంటోంది తాప్సీ పన్ను. తాప్సీకి ఎంత ముందు చూపో కదా. అంతేకాదు, తాప్సీ ముందు చూపు ఎంతో మంది అమ్మాయిలకు ఆదర్శం కూడా. హ్యాట్సాఫ్ టు తాప్సీ.!