'బాహుబలి'తో యూనివర్సల్ స్టార్ అయిపోయిన ప్రబాస్ సరసన నటించేందుకు బాలీవుడ్ ముద్దుగుమ్మలు సుముఖంగానే ఉన్నారు. అయితే అంత బిజీగా ప్రబాస్ సినిమాలు చేయడం లేదు. ఎట్టకేలకు 'బాహుబలి' తర్వాత ఒప్పుకున్న భారీ బడ్జెట్ మూవీ 'సాహో' కోసం మాత్రం బాలీవుడ్ భామలు క్యూ కట్టారు. వారిలో శ్రద్ధాకపూర్‌కి ఆ ఛాన్స్ దక్కింది.
ఇకపోతే బాలీవుడ్లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్గా కొనసాగుతున్న శ్రద్ధాకపూర్ ఏమంత అమాయకురాలు కాదు, అంత సులువుగా ఈ సినిమాకి సైన్ చేయలేదట. తన పాత్రకు చాలా వెయిట్ ఉండడం వల్ల శ్రద్దా ఈ సినిమాకి సైన్ చేసిందట. హీరోతో పాటు, హీరోయిన్ క్యారెక్టర్‌కీ వెయిట్ ఎక్కువే అని మొదట్నుంచీ మనం వింటున్నాం. అయితే ఇంతకీ శ్రద్ధా పాత్ర ఏంటనే విషయంపై కాస్త క్లారిటీ వచ్చిందిప్పుడు.
ఆమె ఓ టీమ్‌ని లీడ్ చేసే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతోందట. ఆ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా రన్ అవుతుందట. ఇక శ్రద్ధా పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబోయే 'ఛాప్టర్ 2'ని శ్రద్ధా పాత్రను హైలైట్ చేస్తూ కట్ చేశారట. అంటే ఛాప్టర్ 2 మొత్తం శ్రద్ధానే కనిపించబోతోందన్న మాట. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. సినిమాని ఆగష్టులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.