హిందీ నటి కరిష్మా కపూర్ తన మాజీ భర్త సంజయ్ నుండి విడాకులు తీసుకున్న తరువాత ముంబైలోని వ్యాపారవేత్త సందీప్ తో ప్రేమలో పడినట్టు పుకార్లు షికారు చేశాయి.
దీనికి సంబంధించి వారిరువురు కలిసి ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో ఈ పుకార్లకీ బలం చేకూరాయి. ఇక ఇదే విషయమై కరిష్మా తండ్రి రణధీర్ కపూర్ ని విలేకరుల ప్రశ్నించగా- ‘నేను వారిరువురి ఫోటోలు పత్రికల్లో చూసాను, అయితే కరిష్మా అతనిని ఇష్టపడితే పెళ్ళి చేసుకోవడంలో నా మద్దతు ఉంటుంది’ అని చెప్పాడు.
అయితే బాలీవుడ్ మీడియా మాత్రం త్వరలోనే వీరి వివాహం జరగనుంది అని కొడైకూస్తున్నది. ఇక సందీప్ కూడా తన మాజీ భార్య నుండి విడాకులు పొందాడు.