హీరోగా ప్రత్యేకమైన స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు తమిళ హీరో కార్తీ. ఆయన ఒక్కడినే చూసి, సినిమాకి వెళ్లే వారుంటారు.. అనే నమ్మకం ఎంతలా లేకపోతే, 'ఖైదీ' సినిమాని తెరకెక్కిస్తారు చెప్పండి. సినిమా అంటే ఆరు పాటలు, నాలుగు ఫైట్లూ. ఇదే సినిమాకి సంబంధించి కమర్షియల్ సూత్రం. అయితే, వీటిలో ఏ ఒక్కటి మిస్ అయినా, అది ఎంటర్‌టైన్‌మెంట్‌కి కాస్త భంగమే. మాస్ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేయాలంటే ఈ రెండూ ఖచ్చితంగా సినిమాలో మిళితమై ఉండాల్సిన అంశాలే. ఫైట్ల సంగతి ఎలా ఉన్నా, సినిమాకి హీరోయిన్ పాత్రనేది కీలకం.
ఆమె పాత్రకు ఇంపార్టెన్స్ ఉన్నా లేకున్నా, జస్ట్ పాట కోసమైనా అలా వచ్చి ఇలా వెళ్లిపోయే క్యారెక్టర్‌లా హీరోయిన్ పాత్రను వాడుతుంటారు. కానీ, మన హీరో కార్తి అసలు హీరోయినే లేకుండా సినిమా చేసేశాడండీ బాబూ. అదే 'ఖైదీ' సినిమా. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్‌లోని యాక్షన్ ఎలిమెంట్స్, కార్తి చెప్పే డైలాగ్స్ మాస్ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
సాంగ్స్ లేకున్నా, హీరోయిన్ గ్లామర్ లేకున్నా, ఖచ్చితంగా ఈ సినిమాతో కార్తి ఏదో మ్యాజిక్ చేసేలానే ఉన్నాడంటూ సినీ విశ్లేషకులు అప్పుడే తమ అభిప్రాయాలు బయట పెట్టేస్తున్నారు. దీపావళికి ఈ సినిమాని విడుదల చేయనున్నారు. మరి 'ఖైదీ'తో కార్తి మ్యాజిక్ ఫలిస్తుందా.? ప్రేక్షకుల్ని తన పర్‌ఫామెన్స్‌తో ఖైదు చేయగలడా.? వేచి చూడాల్సిందే.