శర్వానంద్ హీరోగా వస్తున్న చిత్రం ఒకే ఒక జీవితం. రీతు వర్మ అమల అక్కినేని, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణం. సెప్టెంబర్ 9న థియేటర్లలోకి వస్తుంది. ఇప్పటికే పాటలు టీజర్ విడుదలయ్యాయి. ఐతే రావాల్సిన బజ్ రాలేదు. అయితే ఇప్పుడు హీరో కార్తీ తన వంతు సాయం చేశాడు.
ఈ సినిమా నుండి తాజాగా ''మారిపోయే'' అనే పాటని విడుదల చేశారు. ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే హీరో కార్తీ స్పెషల్ ఎప్పిరియన్స్ లో కనిపించి, స్వయంగా ఆయనే పాడాడు. పాట క్యాచిగానే వుంది. కార్తి ఫుల్ లెంత్ పాటలో కనిపించాడు. ఈ చిత్రం మొదటి నుండి పెద్ద బజ్ లేదు. ఇప్పుడు హీరో కార్తి రంగంలో దిగి తన వంతు సాయం చేశాడు. మరి కార్తి పాటతోనైనా దీనికి కొత్త జోష్ వస్తుందేమో చూడాలి.