రియల్ కంటెన్ట్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత దక్కుతోందిప్పుడు. యదార్ధ ఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న చిత్రాలు కావచ్చు. లేదంటే రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉండే స్టోరీలు కావచ్చు. వాటికి దృశ్యరూపం ఇవ్వడంలో కాస్తంత క్రియేటివిటీని ఉపయోగిస్తే, ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అవుతున్నారు.
వాటికి ఎగ్జామ్‌పుల్స్‌గా ఈ మధ్య విడుదలై సక్సెస్ అందుకున్న 'ఆర్‌ఎక్స్ 100', 'కేరాఫ్ కంచరపాలెం' తదితర చిత్రాలను చెప్పుకోవచ్చు. ఇకపోతే 'ఆర్‌ఎక్స్ 100' సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించిన కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌లకు మంచి గుర్తింపుతో పాటు, బోలెడంత క్రేజ్ కూడా వచ్చేసింది. అదే క్రేజ్‌ని పలువురు నిర్మాతలు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. ఈ క్రేజీ స్టార్స్‌కి క్రేజీ ఆఫర్లు కట్టబెడుతున్నారు.
తమిళంలో 'తుపాకి', 'తెరి', 'కబాలి', స్కెచ్' తదితర చిత్రాలను రూపొందించిన కలైపులి ఎస్ థాను, కార్తికేయతో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టి.ఎన్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి 'హిప్పీ' అనే టైటిల్ పెట్టారు. రొమాంటిక్ కామోడీ జోనర్‌లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట. 'ఆర్‌ఎక్స్ 100' లిమిటెడ్ బడ్జెట్‌తో రూపొందినా, 'హిప్పీ' మాత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతోందట.