కార్తికేయుడు మంచి బాలుడు!

By iQlikMovies - May 29, 2019 - 19:00 PM IST

మరిన్ని వార్తలు

అమ్మాయిలే కాదండోయ్‌ మనోడికి ట్రెడిషన్‌ కూడా బాగా తెలుసు. చూస్తున్నారుగా బంగార్రాజులా పంచె కట్టు కట్టి, కళ్లకు గాగుల్స్‌ పెట్టి, చేతికి గోల్డెన్‌ వాచ్‌ పెట్టి, ఎలా నడిచొస్తున్నాడో. నడి నెత్తిన భానుడు సెగ రేపుతుంటే, బీచ్‌ ఒడ్డున హాయిగా స్మైల్‌ ఇస్తూ కూల్‌ వాక్‌ చేస్తున్నాడు మన 'గుణ'. అదేనండీ 'ఆర్‌ఎక్స్‌' బుల్లోడు కార్తికేయ. ఆయన తాజా చిత్రం 'గున 369' అన్న సంగతి తెలిసిందే. అర్జున్‌ జంధ్యాల ఈ సినిమాకి దర్శకుడు. స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపికా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది.

 

కండలు తిరిగిన దేహంతో బ్యాక్‌ యాంగిల్‌లో లుక్‌ ఇచ్చుకున్న మనోడు, ఇప్పుడు కూల్‌గా ఫ్రంట్‌ లుక్‌లో దర్శనమిచ్చాడు. 'గుణ 36'9' అనే పవర్‌ఫుల్‌ టైటిల్‌కి తగ్గట్లుగా ఫస్ట్‌లుక్‌ విడుదల చేసి షాక్‌ ఇచ్చారు మొన్న. తాజా లుక్‌తో సందిగ్ధంలోకి నెట్టేశారు. ఇంతకీ 'గుణ' ఎలాంటి సినిమా అని అనుమానంలో పడ్డారు ఆడియన్స్‌. ఏది ఏమైతేనేం ఈ రొమాంటిక్‌ బోయ్‌ ఫ్రెష్‌ లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

 

ప్రస్తుతం కార్తికేయ 'హిప్పీ' సినిమాలో నటిస్తున్నాడు. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కూడా యూత్‌ని ఎట్రాక్ట్‌ చేసే కంటెన్ట్‌తోనే రూపొందిందనీ ప్రచార చిత్రాల ద్వారా అర్ధమైంది. బాక్సర్‌గా నటిస్తున్నాడు ఈ సినిమాలో కార్తికేయ. మరోవైపు నాని నటిస్తున్న 'గ్యాంగ్‌లీడర్‌'లో కార్తికేయ విలన్‌గా నటిస్తున్నాడు. విక్రమ్‌ కుమార్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS