తన దారి రహదారి కాదంటోన్న యంగ్‌ హీరో.!

మరిన్ని వార్తలు

హీరోగా తొలి సినిమాతో సెన్సేషనల్‌ సక్సెస్‌ అందుకున్నాక ఏ హీరో అయినా దిక్కులు చూస్తాడా.? సమస్యే లేదు. చూడనే చూడడు. దూసుకెళ్లిపోతాడు. వచ్చిన క్రేజ్‌ని క్యాష్‌ చేసుకోవడానికే ట్రై చేస్తాడు. కానీ మన యంగ్‌ హీరో కార్తికేయ మాత్రం అలా అస్సలు చేయలేదండోయ్‌. 'ఆర్‌ఎక్స్‌ 100'తో ఊహించని హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. తర్వాత వరుస పెట్టి అవకాశాలు క్యూ కట్టేశాయి మనోడికి. 

 

కానీ ఏమాత్రం కంగారుపడకుండా డిఫరెంట్‌గా ఆలోచిస్తూ అడుగులేస్తున్నాడీ కుర్రహీరో. హీరోగా సెకండ్‌ మూవీ 'హిప్పీ'లో నటిస్తున్నాడు ఆల్రెడీ మనోడు. మరోవైపు నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ ని కార్తికేయ తన కోసం ఛూజ్‌ చేసుకున్నాడు. ఈ క్యారెక్టర్‌ నెగిటివ్‌ షేడ్స్‌తో కూడుకున్నదనే ప్రచారం ఉంది. అయినా కానీ ఈ క్యారెక్టర్‌ని ఎంతగానో ఇష్టపడి తాను సెలెక్ట్‌ చేసుకున్నానంటున్నాడు కార్తికేయ. 

 

ఈ క్యారెక్టర్‌ విషయమై పలు విమర్శలు వస్తున్నాయి కార్తికేయకు. కానీ అవేమీ తాను పట్టించుకోననీ, తాను సెలెక్ట్‌ చేసుకున్న దారిలోనే తాను నడుస్తానంటున్నాడు కార్తికేయ. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా లేటెస్ట్‌గా స్టార్ట్‌ అయ్యింది. ఈ రోజు నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ సినిమా 1990 దశకానికి చెందిన క్రికెటర్‌ జీవిత చరిత్ర నేపథ్యంలో రూపొందుతోంది. మైత్రీ మూవీస్‌ మేకర్స్‌ సంస్థ ఈ సినిమాని రూపొందిస్తోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS