బాలీవుడ్ నుండి తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ అదితీరావ్ హైదరీ. 'సమ్మోహనం' సినిమాతో కుర్రకారును మోహంలో ముంచేసింది. నిజానికి డబ్బింగ్ సినిమా 'చెలియా'తో మాయ చేసింది. స్ట్రెయిట్ మూవీ అంటే 'సమ్మోహనం'. ఆ తర్వాత 'అంతరిక్షం' మూవీలో వరుణ్‌తేజ్‌కి జంటగా నటించింది. ఏస్ట్రోనాట్ క్యారెక్టర్ కోసం బాగా కష్టపడిందట. కానీ ఇష్టపడి ఆ క్యారెక్టర్‌లో నటించానని చెబుతోంది.
ఇక ఎక్స్‌పోజింగ్ అంటే పెద్దగా మొహమాటాల్లేవ్ కానీ, సందర్భాన్ని బట్టి, సన్నివేశాన్ని బట్టి ఎక్స్‌పోజింగ్ చేస్తానంటోంది. అయినా హీరోయిన్ అన్నాక గ్లామర్ ఉండాలి. అయితే హీరోయిన్ అంటే ఓన్లీ గ్లామరే కాదు, అవకాశం వస్తే, పర్‌ఫామెన్స్‌లోనూ సత్తా చాటగలదు అని చెబుతోంది. గాసిప్స్ విషయంలో ముద్దుగుమ్మలు స్పందిస్తే ఒక రకం తంటా. స్పందించకపోతే మరో రకం తంటా అని అదితీరావ్ చెబుతోంది.
అదృష్టవశాత్తూ తనపై ఇంతవరకూ ఎలాంటి గాసిప్స్ రాలేదనీ, కాస్టింగ్ కౌచ్ వంటి అభ్యంతరకర పరిస్థితుల్ని కూడా తాను ఫేస్ చేయలేదని చెబుతోంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో రెండు సౌత్ సినిమాలున్నాయి. బాలీవుడ్‌లో ఓ సినిమా చర్చల దశలో ఉందట. ఇదిలా ఉంటే, తనకు ప్రయోగాత్మక చిత్రాల్లో నటించడమంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ అంటోంది. గ్లామర్‌తో పాటు, విభిన్న కథా చిత్రాలను కూడా వదలనంటోంది క్యూట్ అండ్ హాట్ అదితీరావ్ హైదరీ.