సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్‌కి వ్యతిరేకంగా శ్రీరెడ్డి పోరాటం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ కోవలోనే ఆ పోరాటం విషమించి, పలువురు సినీ ప్రముఖులపై అసభ్యకరమైన ఆరోపణలకు దారి తీసింది.
ఈ సంగతి అటుంచితే, ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యాక సినీ పరిశ్రమ నుండి పలువురు నటీమణులు తాము కూడా ఈ కాస్టింగ్ కౌచ్ బాధితులమే అంటూ తమ తమ అనుభవాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ లిస్టులో చాలా మంది హీరోయిన్లు, ఇతర టెక్నీషియన్లు కూడా ఉన్నారు. ఈ సంగతి అటుంచితే, తాజాగా సీనియర్ హీరోయిన్ కస్తూరి కాస్టింగ్‌కౌచ్‌పై తాజాగా స్పందించింది. శ్రీరెడ్డి చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలిచింది. ఆమె పోరాటం సబబే. ఆమె ఆవేదనను అందరూ అర్ధం చేసుకోవాలి అని కస్తూరి, శ్రీరెడ్డికి బాసటగా నిలిచింది.
ఇక ఆమె చేస్తున్న ఆరోపణల సంగతి పక్కన పెడితే, అసలింతకీ ఆమె పోరాటం దేని కోసం? అని కాస్త లోతుగా ఆలోచించాలి. ఆ రకంగా ఆలోచిస్తే ఆమె పోరాటంలో న్యాయం ఉందనిపిస్తుంది అంటూ కస్తూరి శ్రీరెడ్డిని సమర్థించింది.
అంతేకాదు, సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులున్నాయి. ఇందుకు నేను కూడా సాక్షినే అని కస్తూరి చెప్పుకొచ్చింది. 'అన్నమయ్య' తదితర చిత్రాల్లో కస్తూరి నటించింది. తెలుగుతో పాటు. తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లోనూ కస్తూరి నటించింది.