సంచలనాలకి కేర్ అఫ్ అడ్రస్ అయిన శ్రీ రెడ్డి ఇప్పుడు తన మకాం హైదరాబాద్ నుండి చెన్నైకి మార్చింది. దీనితో ఆమె పైన చెన్నై నడిగర్ సంఘం కన్నెర్ర చేసింది.
ఆ వివరాలు ఇలా ఉన్నాయి, ఈమధ్య కాలంలో ఆమె తమిళ నటులు, దర్శకుల పైన చేసిన కామెంట్స్ అక్కడ పెద్ద చర్చకే దారితీసాయి. అక్కడి నడిగర్ సంఘం ప్రతినిదులు అయిన విశాల్, కార్తిలు ఇప్పటికే ఆమెకి ఇటువంటి నిరాధార ఆరోపణలు చేయొద్దు అని చెప్పడం జరిగింది.
దీనికి ఆమె నుండి ఎటువంటి స్పందన రాక పొగ ఇప్పుడు ఏకంగా చెన్నైకే వచ్చి తమని అనవసరంగా టార్గెట్ చేస్తుండడం పట్ల వారు తీవ్రంగా పరిగణించారు. ఇక ఇలా అనవసర రాద్ధాంతానికి ప్రయత్నిస్తున్న ఆమె పై చెన్నైలోని పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఆమె పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేశారు.
దీనితో శ్రీ రెడ్డి అంశం ఇప్పుడు ఏకంగా పక్క చలనచిత్ర పరిశ్రమలో సైతం హాట్ టాపిక్ గా మారింది.