బడా హీరోల సినిమాలకి రిలీజ్ ముందే బిజినెస్ జరిగిపోవడం సర్వసాధారణం. ఇక అదే పవన్ సినిమాలకి ఉండే క్రేజ్ అందరికి తెలిసిందే.
కాటమరాయుడి విషయానికి వస్తే, ఈ సినిమా బిజినెస్ రూ 100కోట్ల మార్కెట్ దాటింది. సర్దార్ సినిమా మంచి వసూళ్లు సాదించకపోయినా ఈ రేంజ్ బిజినెస్ జరగడం ఒక్క పవన్ కే చెల్లింది. తెలుస్తున్న ప్రాధమిక లెక్కలు బట్టి, థియేటర్, శాటిలైట్ రైట్స్ అన్ని కలిపి సుమారుగా రూ 110కోట్లు సమకూరగా అందులో రూ 35-40 కోట్లు (రెమ్యునరేశన్లు మినహాయించి) వరకు నిర్మాణానికి అయింది.
దీన్ని బట్టి నిర్మాతలు సేఫ్ అని తెలుస్తుంది. మరి పంపిణిదారుల పరిస్థితి సినిమా రిలీజ్ అయ్యాకనే తెలుస్తుంది.