ఉయ్యాలవాడ నర్సింహారెడ్డిలో చిరంజీవి గెటప్ ఇదేనంటూ సోషల్ మీడియాలో అభిమానులు సందడి చేస్తున్నారు. గెటప్‌కి సంబంధించి, కొన్ని స్కెచెస్ వచ్చాయి. అవి సినిమా కోసం చిత్ర యూనిట్ వేయించినవేనని సమాచారమ్. అయితే ఇంతవరకు నిర్మాత రామ్‌చరణ్ వీటిని కన్‌ఫామ్ చేయలేదు. కొన్ని డిజైన్లు కూడా అభిమానులు సృషిస్తున్నారు. తొలి తరం తెలుగు స్వాతంత్య్ర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి. మరుగున పడిపోయిన చరిత్ర ఇది. అలాంటి గొప్ప చరిత్రను ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాకి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మొదట్లో సురేందర్ రెడ్డి ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని చిరంజీవితో తెరకెక్కించాలనుకున్నారు. అనుకోకుండా ఉయ్యాలవాడ సబ్జెక్ట్ ఆయన ముందుకొచ్చింది. దాంతో ఎంతో ప్రతిష్థాత్మకంగా భావించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఆయన. చిరంజీవి కూడా ఈ చిత్రంలో నటించడానికి చాలా ఇష్టపడుతున్నారు. ఎప్పుడో ఆయన ఈ సినిమాలో నటించాలని అనుకున్నారు. కానీ కుదరలేదు. ఆ కోరిక ఇన్నాళ్లకు తీరబోతోంది. అది కూడా 151 వ చిత్రంగా. అందుకే ఈ సినిమా చిరంజీవికి ఎంతో ప్రత్యేకం. అలాగే ఈ సినిమా యూనిట్ మొత్తానికి ఎంతో ప్రత్యేకం. ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకి స్టోరీని తయారు చేస్తున్నారు.