రంగమ్మత్తా.. ఈ రూమర్ నిజమేనా?

మరిన్ని వార్తలు

న్యూస్‌ రీడర్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసి, యాంకర్‌గా బుల్లితెరపై సత్తా చాటుతూ, పెద్ద తెరపై అదృష్టం పరీక్షించుకుని, సక్సెస్‌ అయిన ముద్దుగుమ్మ అనసూయా భరద్వాజ్‌. ఫార్టీ ప్లస్‌ వయసున్నా, ఆమె అందానికి ఎంత క్రేజో, ఎంతమంది ఫాలోవర్సో ఆమె సోషల్‌ మీడియా ఆకౌంట్లు చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. అయితే, అనసూయకు ఇంత ఫేమ్‌ ఎప్పుడొచ్చిందా.? అంటే అందుకు కారణం ఖచ్చితంగా బుల్లితెర కామెడీ షో జబర్దస్త్‌ అని ముక్కు సూటిగా చెప్పేయొచ్చు. ఈ షోతో వచ్చిన ఫేమ్‌తోనే అనసూయ ఆ రేంజ్‌లో క్రేజ్‌ దక్కించుకుంది. అందుకే ఎంత ఫేమ్‌ దక్కినా, ఎప్పటికీ జబర్దస్త్‌ని వదిలేది లేదని ఖరాఖండిగా, నిక్కర్చిగా చెప్పేస్తుంటుంది అందాల అనసూయ. అయితే, తాజాగా సర్క్యులేట్‌ అవుతోన్న ఓ రూమర్‌, అనసూయ 'జబర్దస్త్‌'కి గుడ్‌బై చెప్పేస్తుందట అనే అనుమానం రేకెత్తిస్తోంది. ప్రస్తుతం స్పెషల్‌ రోల్స్‌తో, స్పెషల్‌ సాంగ్స్‌తో బిగ్‌ స్క్రీన్‌పై అనసూయ బిజీగా గడుపుతోంది.

 

త్వరలో అనసూయ ప్రధాన పాత్రలో 'కథనం' అనే సినిమా ఒకటి ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో పాటు, మరిన్ని ప్రెస్టీజియస్‌ ప్రాజెక్టులు అనసూయ కోసం చర్చల దశలో ఎదురు చూస్తున్నాయట. ఇలా వీటన్నింటినీ మ్యానేజ్‌ చేయలేక జబర్దస్త్‌ నుండి కొంత తాత్కాలికమైన బ్రేక్‌ తీసుకోవాలనుకుంఓటందట అనసూయ. కానీ, జబర్దస్త్‌ని వదిలేస్తే అనసూయకు కెరీర్‌ ఉంటుందా.? ప్రశ్నార్ధకమే. మరి తాజాగా ప్రచారంలో ఉన్న ఈ రూమర్‌పై అనసూయ స్పందించాల్సి ఉంది. లేదంటే వార్తల్లో, అనసూయని జబర్దస్త్‌ నుండి తొలగించేసినా తొలగించేస్తారు మరి. మొన్నటి వరకూ నాగబాబుని, రోజాని తొలగించేసినట్లన్న మాట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS