నాని-నివేతా థామస్ జంటగా నటించిన నిన్ను కోరి చిత్రం పాటలు, ట్రైలర్ ఇప్పటికే పెద్ద హిట్ అయ్యాయి. దీనితో ఈ సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
ఈ తరుణంలో నిన్ను కోరి చిత్ర యూనిట్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ని జూన్ 29న జరపడానికి నిర్ణయించింది. అయితే ఈ ఈవెంట్ ఎక్కడ జరగనుంది అనేది ఇంకా తెలియాల్సిఉంది.