ప్రభాస్ సినిమా రేంజ్ మారిపోయింది. తన సినిమా అంటే కచ్చితంగా పాన్ ఇండియా ప్రాజెక్టే అవుతోంది. తన సినిమా అంటే హీరోయిన్ గా బాలీవుడ్ నుంచే దిగుమతి చేయాల్సివస్తోంది. నాగ అశ్విన్ సినిమా కోసం.. దీపికా పదుకొణెని రంగంలోకి దింపారు... అందుకే. త్వరలోనే మరో సినిమా కోసం కత్రినా కైఫ్ ని హీరోయిన్ గా అనుకుంటున్నార్ట. బాలీవుడ్ లో యాక్షన్ సినిమాల దర్శకుడిగా సిద్దార్థ్ ఆనంద్ కి మంచి పేరు ఉంది.
ప్రభాస్ - సిద్దార్థ్ కాంబో ఎప్పుడో ఓకే అయ్యింది. అధికారిక ప్రకటన మాత్రం రాలేదంతే. ప్రస్తుతం ప్రభాస్‌కి సరి పడ కథ తయారు చేసి, స్క్రిప్టు వర్క్ లో నిమగ్నమయ్యాడు. ఇందులో కథానాయికగా కత్రినాకైఫ్ ని ఎంచుకోవాలని చూస్తున్నార్ట. ప్రభాస్ - కత్రినా జోడీ చాలా బాగుంటుంది. ఇది వరకు `సాహో` సమయంలోనూ కత్రినా పేరు పరిశీలనకు వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాకి సెట్ అవుతోందన్నమాట. ఆదిపురుష్ తరవాత.. నాగ అశ్విన్ తో ఓ సినిమా చేయాలి ప్రభాస్. మరి.. సిద్దార్థ్ కి డేట్లు ఎప్పుడు ఇస్తాడో?