గ్లామ్‌షాట్‌: గోల్డెన్‌ హాట్‌ 'మల్లీశ్వరి'!

మరిన్ని వార్తలు

'మల్లీశ్వరి' సినిమాలో నటించిన ముద్దుగుమ్మ కత్రినా కైఫ్‌ని ఎవరైనా మర్చిపోగలరా.? అంత సీన్‌ లేదంటారు కదా. అవును ఆ అందం అలాంటిది. యాక్టింగ్‌ రాదు, డాన్సులు రావు.. అనే విమర్శలు ఎదుర్కొన్నా కానీ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌. ఇక మల్లీశ్వరి క్యారెక్టర్‌ని డిజైన్‌ చేసిన విధానం కూడా చాలా గట్టిది. ఆమె అందాల్ని చూపించిన తీరు కుర్రకారు గుండె పగిలిపోయేలా చేసింది. అందుకే అంత సులువుగా మల్లీశ్వరిని మర్చిపోవడం ఎవ్వరి తరమూ కాదు. కానీ దురదృష్టమేంటంటే, ఈ మల్లీశ్వరి తెలుగు ప్రేక్షకుల్ని వదిలి వెళ్లిపోయింది.

 

బాలీవుడ్‌లో పాగా వేసింది. అక్కడ ఓ రేంజ్‌ స్టార్‌డమ్‌ దక్కించుకుంది. తెలుగులో వచ్చిన విమర్శల్ని సవాల్‌గా తీసుకుని అక్కడ తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకుంది. ఒకానొక టైంలో కత్రినా కైఫ్‌ని చూసి తెలుగు ఆడియన్స్‌ షాక్‌ అయ్యారు కూడా. అంతలా ఆమెలో ఛేంజ్‌ ఓవర్‌ చూశారు. ఇక బాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ దక్కించుకున్నాక, టాలీవుడ్‌ వైపు తిరిగి చూడలేదు కత్తిలాంటి కత్రినా.

 

అప్పుడప్పుడూ సోషల్‌ మీడియాలో ఈ ఆరాధ్య దేవతను ఆరాధించడం తప్ప, తెలుగు ఆడియన్స్‌ కోసం మచ్చుకైనా టైం స్పెండ్‌ చేయలేదు హాట్‌ హాట్‌ అందాల కత్రినా. గోల్డెన్‌ కలర్‌లో అల నుండి ఇల దిగిన దేవతలా ఓ లుక్‌లో తాజాగా కత్రినా ఫోటోలు కొన్ని నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ పిక్స్‌ చూసి, ఎంత పని జరిగిపోయింది మన టాలీవుడ్‌కి దక్కాల్సిన ఈ అందమంతా, బాలీవుడ్‌లో సందడి చేస్తోందే.! అని అవాక్కవుతున్నారు తెలుగు నెటిజన్లు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS