హీరోయిన్‌గా టాలీవుడ్‌లోనే తెరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ. 'మల్లీశ్వరి' సినిమాతో కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టేసింది. సూపర్ హిట్ కొట్టి, తొలి సినిమాతోనే విజయం తన ఖాతాలో వేసేసుకుంది. ఆ తర్వాత ఒకటీ అరా సినిమాల్లో నటించింది కానీ పెద్దగా గుర్తింపు దక్కలేదు. తర్వాత బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ నెంబర్ వన్ హీరోయిన్‌గా వెలిగిపోతోంది. బాలీవుడ్‌కి వెళ్లాక కత్రినాలో చాలా చాలా మార్పులొచ్చేశాయి. కెరీర్ తొలి నాళ్లలో డాన్సుల్లో వీక్ అనిపించుకున్న ఈ హాట్ బ్యూటీ తిరుగు లేని డాన్సర్‌గా ఎదిగిపోయింది. హీరోయిన్‌గానే కాకుండా, స్పెషల్ సాంగ్స్‌తోనూ తనదైన ముద్ర వేసుకుంది. హీరోయిన్‌గా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలో హాట్ హాట్ పోజులతో పిచ్చెక్కిస్తూ ఉంటుంది. యూత్‌కి నయా ట్రెండ్‌ని పరిచయం చేస్తూ ఉంటుంది. తాజాగా కత్రినా ధరించిన ఈ కాస్ట్యూమ్ చూశారా ఆమెలాగే కత్తిలా ఉంది కదా. జీన్స్ టాప్, షార్ట్ జీన్స్ బోటమ్‌తో భలే స్టైలిష్‌గుంది కత్రినా గ్లామర్.