పవన్ కళ్యాణ్ అంటేనే సిగ్నేచర్ స్టిల్స్‌కి పెట్టింది పేరు. సినిమా సినిమాకీ ఒక్కో రకం సిగ్నేచర్ స్టిల్స్‌తో యూత్‌ని ఊపేస్తాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన సినిమా సినిమాకి ఏదో ఒక సిగ్నేచర్ స్టిల్ హైలైట్ అవుతూ ఉంటుంది. పవన్ నవ్వినా, స్టిల్లే, చూసినా, స్టిల్లే, ఆఖరికి నడిచినా అదో రకం స్టైలే. అలాంటిది ఇక పవన్ సినిమాల్లో స్టిల్స్‌కి లోటేం ఉంటుంది చెప్పండి. ఆ స్టైలే పవన్‌ని పవర్‌స్టార్ చేసేసింది.
అలాంటిది అసలే 'అజ్ఞాతవాసి'... అక్కడున్నది త్రివిక్రమ్ శ్రీనివాస్. పవన్‌కి ఇంకెంత స్టైల్‌గా చూపిస్తాడు. ఈ రోజు 'అజ్ఞాతవాసి' లేటెస్ట్ స్టిల్ కుర్రోళ్లకి మంచి ఊపిస్తోంది. ఈ నెల 12న 'అజ్ఞాతవాసి' నుండి 'గాలి వాలుగా.. ' ఆడియో సింగిల్ రాబోతోందని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన స్టిల్ ఇది. ఇలాంటివి 'అజ్ఞాతవాసి'లో చాలా సిగ్నేచర్ స్టిల్స్ ఉన్నాయట. ప్రస్తుతానికి ఈ స్టిల్‌తో అభిమానులు పండగ చేస్కోవాలి. ఆల్రెడీ రిలీజైన ఆడియో సింగిల్ 'బైటికొచ్చి చూస్తే..' సాంగ్‌తో సినిమా నుండి ఏ స్టిల్స్ రాలేవు. థీమ్ కాన్సెప్ట్‌తో ఆ సాంగ్ వీడియోని రూపొందించారు. కానీ ఈ సారి రాబోయే ఆడియో సింగిల్‌కి సినిమా నుండి కొన్ని స్టిల్స్ రిలీజ్ చేయనున్నారనీ సమాచారమ్.
ఇంతవరకూ ఫస్ట్‌లుక్ పోస్టర్స్ కనువిందు చేశాయి. ఇక త్వరలోనే ట్రైలర్ పండగ రానుందట. సినిమా విడుదల కావడానికి టైం దగ్గర పడింది. దగ్గర పడుతున్న కొద్దీ ఇక ప్రచార చిత్రాల హవా స్టార్ట్ కానుందట. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి తమిళ యంగ్ స్టర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి లాండ్ అయ్యాడు. పవన్ సాంగ్స్‌తో ఈ యంగ్ అండ్ డైనమిక్ ఎంట్రీ ఇవ్వడం విశేషం. అనూ ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్న 'అజ్ఞాతవాసి'లో సీనియర్ నటి కుష్బూ ఓ కీలక పాత్ర పోషిస్తోంది.