బయోపిక్‌ దిశగా మరో బాలీవుడ్‌ నటి?

మరిన్ని వార్తలు

'మల్లీశ్వరి'గా టాలీవుడ్‌కి పరిచయమై, ఇక్కడ పెత్తనం చెలాయించలేక బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడే నటిగా కొత్తగా పుట్టింది. విమర్శలతో స్టార్ట్‌ అయిన ఆమె సినీ కెరీర్‌, తర్వాత కత్రినా టాలెంట్‌ ఇదీ అని నిరూపించింది. అస్సలు బాడీలో రిథమే లేదు, ఫేస్‌లో ఎక్స్‌ప్రెషనే లేదు.. ఈమెనా.? హీరోయినా.? అంటూ ఎదుర్కొన్న విమర్శలతోనే, వావ్‌ కత్రినా ఇది నువ్వేనా.? అనిపించుకునేలా తనలోని నటిని బిల్డప్‌ చేసుకుంది. ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ కత్రినా. తాజాగా 'భారత్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో కత్రినా ఇంట్రెస్టింగ్‌ అంశాల్ని షేర్‌ చేసుకుంది.

 

ప్రస్తుతం బాలీవుడ్‌లో బయోపిక్స్‌ హవా ఏ రేంజ్‌లో ఉంది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రియాంకా, దీపికా.. ఇలా పలువురు స్టార్‌ ముద్దుగుమ్మలు బయోపిక్స్‌తో ముందంజలో ఉన్నారు. వారి కోవలోనే కత్రినా కూడా నడవబోతోందా.? అంటే అవుననే సంకేతాలు పంపిస్తోంది కత్తిలాంటి కత్రినా. పరుగుల రాణి పి.టి.ఉష గురించి అందరికీ తెలిసిందే. ఈమె బయోపిక్‌లో కత్రినా నటిస్తోందట అనే ప్రచారం గత కొంత కాలంగా జరుగుతోంది. ఇదే విషయమై ఆమెను ప్రశ్నిస్తే, నటించేందుకు పెద్దగా ఇబ్బంది లేదు కానీ, కథ నాకు సెట్‌ అయితే చేసేస్తా.. అని చెప్పేసింది. అంటే ఈ బయోపిక్‌లో నటించేందుకు కత్రినా సుముఖంగానే ఉన్నట్లు ఆమె మాటల ద్వారా అర్ధమయ్యింది. ప్రస్తుతం కత్రినా, అక్షయ్‌ కుమార్‌తో 'సూర్యవంశీ' సినిమాలో నటిస్తోంది. రోహిత్‌ శెట్టి ఈ సినిమాని రూపొందిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS