కట్టప్ప హీరోగా అదిరిపోయే కాన్సెప్ట్‌.!

By iQlikMovies - May 09, 2019 - 10:30 AM IST

మరిన్ని వార్తలు

'బాహుబలి' సినిమా తర్వాత 'కట్టప్ప' పేరు మార్మోగిపోతోంది. పరిచయం అక్కర్లేని పేరైపోయిందిది. అంతలా ఆ పాత్రతో ప్రభావితం చేశాడు నటుడు సత్యరాజ్‌. 'బాహుబలి' తర్వాత సత్యరాజ్‌కు అవకాశాలు క్యూ కట్టాయి. సత్యరాజ్‌ ఉన్నాడంటే ఆ సినిమా సూపర్‌ హిట్టు అనేంతలా ఇంపాక్ట్‌ చూపిస్తున్నాడు. అయితే గతంలోనూ మన కట్టప్ప హీరోగా పలు చిత్రాల్లో నటించారు. 'కట్టప్ప' పుణ్యమా అని మళ్లీ ఇప్పుడు హీరో అవతారమెత్తుతున్నారు సత్యరాజ్‌.

 

తాజాగా సత్యరాజ్‌ ప్రధాన పాత్రలో 'తీర్పుగల్‌ విర్కపడుం' అనే సినిమా రూపొందుతోంది. తెలుగు, తమిళ భాషలతో పాటు, యూనివర్సల్‌గానూ కట్టప్పకు మంచి గుర్తింపు ఉందిప్పుడు. అదే ఆయన మార్కెట్‌ విస్తరించుకోవడానికి కారణమవుతుంది. ఇక ఈ తాజా చిత్రం తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఇక సినిమా కథ విషయానికి వస్తే, ఈ సినిమాలో సత్యరాజ్‌ ఓ మెడికల్‌ కాలేజ్‌ ప్రొఫిసర్‌గా కనిపించనున్నారు. కూతురుకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసే ఓ తండ్రి కథ ఇది. నేటి సమాజంలో అమ్మాయిలపై జరుగుతున్న అకృత్యాలకు అద్దం పట్టేలా ఈ కథ ఉండబోతోంది.

 

మంచి మెసేజ్‌తో కూడిన చిత్రమిది. ప్రతీ ఆడపిల్ల తండ్రీ చూడదగ్గ సినిమా అవుతుందంటున్నారు. సత్యరాజ్‌ కూతురు పాత్రలో స్మృతీ వెంకట్‌ నటిస్తోంది. దాదాపు 70 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధం కానుంది. తెలుగులో ఈ సినిమాకి ఓ ప్రామిసింగ్‌ టైటిల్‌ని పరిశీలిస్తున్నారట


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS