బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా గ్లామర్ విషయంలో కొన్ని పరిధులకు లోబడి ఇప్పటిదాకా వ్యవహరించింది. ఇప్పుడు కట్టలు తెంచేసింది గ్లామర్ విషయంలో. పరిధి దాటేసిందీ అందాల 'పరి'. 'పరి' అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ బ్యూటీ అవకాశాల కోసమే చేసిందో, అందమే అసలైన యాటిట్యూడ్.. అని చెప్పాలనుకుందోగానీ, ఒక్క ఫొటోసెషన్‌తో ఒక్కసారిగా బాలీవుడ్ దృష్టిని తనవైపుకు తిప్పేసుకుంది. చాలామంది అందాల భామలు ఇలాంటి ఫొటోలతో దర్శక నిర్మాతల దృష్టిలో పడ్డారు, అవకాశాలు కొల్లగొట్టేశారు. పరిణీతి చోప్రాకీ ఆ దశ పట్టేలానే వుంది. ఏమాటకామాటే చెప్పాలంటే చెక్కిన శిల్పంలా వుంది ఈ బికీనీ ఫొటోల్లో పరిణీతి చోప్రా. అందం చూడవయా.. ఆనందించవయా.. అన్నది ఇందుకే, ఏదేమైనా చోప్రా గర్ల్ హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ కావడం ఆమెకీ బోల్డంత ఆనందాన్నిస్తుందని నిస్సందేహంగా చెప్పొచ్చు.