ఈవారం చాలా విచిత్రంగా నిజజీవితంలో జీవిత భాగస్వాములైన చైతు-సమంతలు ఇద్దరు తమ తమ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. దీనిని భార్యాభర్తల సవాల్ గా కూడా మీడియా ప్రోమోట్ చేసింది.
ఇక ముందుగా సమంత నటించిన యూ టర్న్ గురించి మాట్లాడుకుంటే- కన్నడలో విజయం సాధించిన చిత్రాన్ని అదే దర్శకుడు తెలుగు బాషలో తీసిన చిత్రమిది. అయితే థ్రిల్లర్ కథలని చెప్పే సమయంలో ఎప్పుడు కూడా తడబాటుకి గురవ్వకుండా ఆద్యంతం చూపిస్తేనే ఆ సినిమా ప్రేక్షకులని మెప్పించగలుగుతుంది. ఈ అంశంలోనే దర్శకుడు పవన్ కుమార్ కాస్త తడబడ్డాడు.
అయితే ఈ చిత్రానికి సమంత-ఆది పినిశెట్టిల నటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వీరిరువురి నటనకి మంచి మార్కులు పడ్డాయి. టాక్ కూడా యావరేజ్ అని వచ్చినప్పటికి కలెక్షన్స్ మాత్రం ఆశించిన మేర రావడంలేదు అని నిజం.
ఇప్పుడు చైతు శైలజా రెడ్డి గురించి మాట్లాడుకుంటే ఒక మంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో దర్శకుడు మారుతీ దర్శకత్వంలో వచ్చిన శైలజా రెడ్డి అల్లుడులో ప్రధాన పాత్ర పోషించాడు. ఇక ఈ చిత్ర కథ చాలా రొటీన్ అయినప్పటికి దానికి ఇగో కాన్సెప్ట్ ని జతచేసి కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు మారుతీ.
అయితే ఎందుకనో కాని మారుతి ఈ చిత్రంలో తన మార్కు తాలుకా ఎంటర్టైన్మెంట్ ని ఇవ్వలేకపోయాడు. తన కామెడీ ట్రాక్ ఈ సినిమాలో అంతగా పండలేడనే చెప్పాలి. పైగా రొటీన్ కథనే ఎంచుకోవడం కూడా ప్రేక్షకులకి ఒక రకమైన నిరాశకి గురిచేసింది.
కాకపోతే పండగ సీజన్ లో విడుదలయ్యేసరికి టాక్ తో సంబంధం లేకుండా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్నది. చైతు కెరీర్ లోనే మంచి ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ఈ చిత్రం నిలవడం గమనార్హం.
ఇది ఈ వారం www.iQlikmovies.com టాక్ అఫ్ ది వీక్.