కౌషల్‌ ఎందుకు టార్గెట్‌ అవుతున్నాడు.!

By iQlikMovies - July 28, 2018 - 12:47 PM IST

మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌లో జెన్యూన్‌గా గేమ్‌ ఆడుతుంది ఇంతవరకూ కౌషల్‌ మాత్రమే అని నిస్సందేహంగా చెప్పొచ్చు. బిగ్‌హౌస్‌కి కౌషల్‌ జెంటిల్‌మేన్‌, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అని చెప్పాలి. కానీ హౌస్‌లోని మెంబర్స్‌కి మాత్రం కౌషల్‌ టార్గెట్‌గా మారాడు. 

అందరూ అతన్ని హేట్‌ చేస్తున్నారు. సెపరేట్‌ చేసేస్తున్నారు. కౌషల్‌ ఎమోషన్స్‌ని ఎందుకో అర్ధం చేసుకోవట్లేదు హౌస్‌ మేట్స్‌. డే 1 నుండీ కౌషల్‌పై వ్యతిరేకతే కనిపిస్తోంది. తేజస్విని, భానుశ్రీ ఓ టాస్క్‌లో భాగంగా లిటరల్‌గా కౌషల్‌ పర్సనల్‌ క్యారెక్టర్‌ని బ్యాడ్‌ చేసేందుకు ట్రై చేశారు. హౌస్‌ని జాగ్రత్తగా అబ్జర్వ్‌ చేస్తున్న ఆడియన్స్‌ మాత్రం వాస్తవానికే ఎక్కువ విలువిస్తున్నారు. నామినేషన్స్‌ నుండి కౌషల్‌ని కాపాడుకుంటూ వస్తున్నారు. కౌషల్‌ని బ్యాడ్‌ చేసేందుకు ట్రై చేసిన భానుని, తేజుకి తక్కువ ఓట్‌ చేసి, ఎలిమినేట్‌ చేసేశారు. అయినా కానీ హౌస్‌లో మిగిలిన కంటెస్టెంట్స్‌ నుండి కూడా కౌషల్‌పై ఎందుకో తెలియని తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. 

తాజాగా బాబు గోగినేని , కౌషల్‌కి వ్యతిరేకంగా ప్రవర్తించడం. నాన్‌సెన్స్‌ అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడడం, హౌస్‌ కెప్టెన్‌ అయిన గీతా మాధురి కూడా తప్పు కౌషల్‌పై నెట్టి, ఆయన్ని మాత్రమే వారించేందుకు ప్రయత్నించడం ఇదంతా చూస్తున్న ఆడియన్స్‌కి కౌషల్‌పై మరింత సానుభూతి ఏర్పడుతోంది. హౌస్‌లో నేనున్నా, లేకున్నా కౌషల్‌ని టార్గెట్‌ చేయడం మాత్రం మానొద్దని బాబుగారు హౌస్‌ మేట్స్‌కి సీరియస్‌గా సూచన చేయడం దారుణం అనిపిస్తోంది. 

సామ్రాట్‌, తనీష్‌, రోల్‌ రైడా, ఆఖరికి న్యూట్రల్‌గా కనిపించిన గీత, దీప్తిలు కూడా కౌషల్‌ని హేట్‌ చేస్తున్నారు. ఏది ఏమైనా గేమ్‌ అంటే గేమ్‌ అంతే. పర్‌ఫెక్ట్‌గా ఆడితే ఖచ్చితంగా విజయం దక్కుతుంది. ఆడియన్స్‌ నుండి మాత్రం ఫుల్‌ సపోర్ట్‌ కౌషల్‌కే ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మారి హౌస్‌మేట్స్‌ మనసు గెలుచుకోని కౌషల్‌ తన నిజాయితీతో బిగ్‌బాస్‌ని గెలుచుకుంటాడో లేదో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS