'బిగ్ బాస్ రియాలిటీ షో'.. వివిధ భాషల్లో ప్రసారమవుతూ మంచి ఆదరణ పొందుతున్న బిగ్ బాస్ కి హిందీలో సల్మాన్ ఖాన్, తమిళంలో కమల్ హాసన్ అలాగే మన తెలుగులో నాచురల్ స్టార్ నాని హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో విజయవంతంగా 108 రోజులు పూర్తి చేసుకొని చివరగా విజేతని ఎంచుకునే ఓటింగ్ ప్రక్రియ ఈ వారం మొదలు అయింది. కౌశల్, గీతా మాధురి, తనీష్, సామ్రాట్ మరియు దీప్తి నల్లమోతు టాప్ ఫైవ్ లిస్ట్ లో ఉన్నారు.
మొదటగా బిగ్ బాస్ సీజన్ -2 కి అంతగా ఆశక్తి చూపించని ప్రేక్షకులు, ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే ఆకర్షితులయ్యారు. దానికి కారణం కౌశల్. మొదటగా ఒక యాక్టర్ గా, మోడల్ గా బిగ్ బాస్ షోకి వచ్చిన కౌశల్, ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. గేమ్ ని గేమ్ లా ఆడుతూ, ఉన్నది ఉన్నట్టుగా మొఖం మీద చెప్పేస్తూ ఉంటాడు కౌశల్, ఇదే అందరిని ఇష్టపడేలా చేసింది. ఈ క్రమంలోనే మిగిలిని కంటెస్టెంట్స్ కౌశల్ ని టార్గెట్ చేస్తూ, కార్నర్ చేస్తూ గేమ్ ఆడటంతో అతనిని ఇంకా ఇష్టపడేలా చేసింది.
అలా పుట్టుకొచ్చిందే కౌశల్ ఆర్మీ, ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ కి సపోర్ట్ చేస్తూ 2కే రన్ చేయడం బిగ్ బాస్ చరిత్రలో ఇదే మొదటి సారి. అలాగే కౌశల్ నామినేట్ అయిన ప్రతిసారి వీక్షకులు ఓటింగ్ చేస్తూ షోలో కౌశల్ కొనసాగేలా చేసింది. ఇదే చివరి వారం కావడంతో అది కూడా సీజన్ 2 విజేతని ఎంచుకునే వారం కావడంతో ప్రేక్షకులు ఓటింగ్ చేసే పనిలో పడ్డారు.
ఒక్క సోమవారమే కౌశల్ కి రికార్డు స్థాయిలో ఓట్లు వచ్చాయని బయట ప్రచారం జరుగుతుండటంతో దాదాపు విజేత కౌశల్ అని ఆలోచనలో పడ్డారు ప్రేక్షకులు. కానీ ఇది బిగ్ బాస్ షో ఇక్కడ ఏమైనా జరగొచ్చు అని నాని అన్నట్టుగా, బిగ్ బాస్ సీజన్ 2 విజేత ఎవరో తెలియాలంటే ఈ ఆదివారం వరకు ఆగాల్సిందే.