రూ 50 లక్షల విరాళం ఇచ్చిన రజినీకాంత్

By iQlikMovies - November 21, 2018 - 12:33 PM IST

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ఒక పుస్తకం రాసినా సరిపోదు అన్న విషయం మనకి విదితమే.. ఇంతటి ఫాలోయింగ్ కి ప్రధాన కారణం- ఆయన అఫ్ స్క్రీన్ వ్యవహరించే తీరు, ఎంతో పెద్ద సూపర్ స్టార్ అయినప్పటికీ కూడా అతి సామాన్య జీవితాన్ని గడపడానికే ప్రాధాన్యం ఇచ్చే ఒక వ్యక్తిగా మనం ఆయనని చూడచ్చు.

ఇక ఈ విరాళానికి సంబంధించి వస్తే, తమిళనాట ‘గజ’ తుఫాను సృష్టించిన నష్టాన్ని పూడ్చేందుకు, బాధితలకు సహాయం చేసేందుకు తనవంతు సహాయంగా రజినీకాంత్ రూ 50 లక్షల విరాళం ప్రకటించాడు. ఈ మొత్తాన్నితక్షణమే బాధితులకి అందేలా చర్యలు చేపట్టాలని ఆయన సన్నిహితులకి చెప్పినట్టుగా తెలుస్తున్నది.

రజిని బాటలోనే పలువురు తమిళ సినీ ప్రముఖులు కూడా తమ వంతు ఆర్ధిక సహాయాన్ని గజ తుఫాను బాదితులకి విరాళం రూపంలో అందిస్తున్నారు. ఈ లిస్టు లో ఇప్పటికే సూర్య, కార్తీ, జీవీ ప్రకాష్, శివకార్తికేయన్, విజయ్ సేతుపతి వంటి వారు ఉన్నారు. 

ఏదేమైనా.. ఇటువంటి విపత్తు సమయంలో ఈ స్టార్ హీరోలు చేస్తున్న పనిని అభినందించాల్సిందే...

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS