కామన్ మేన్, కామన్ మేన్.. బుడ్డోడు బుడ్డోడు అంటూ బిగ్ హౌస్‌లో గణేష్‌ని అందరూ ముద్దు చేశారు. కానీ తొమ్మిది వారాలు గడిచేసరికి గణేష్‌లో చాలా మెచ్యూరిటీ వచ్చేసింది. మెచ్యూరిటీ అనాలో లేక ఇరిటేషన్ అనాలో తెలియదు కానీ, ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. అసలు ఇంతకాలం గణేష్ హౌస్‌లో ఎందుకు కొనసాగుతున్నాడో, కూడా అర్ధం కావడం లేదు కొంతమంది బిగ్‌బాస్ షో వీక్షకులకు.
పోనీలే చిన్నోడు. అందులోనూ మనలోంచే వెళ్లిన అతి సామాన్యుడు అంటూ గణేష్‌పై ఒకరకమైన పోజిటివ్ థింకింగ్ నెలకొంది ఇంతవరకూ. కానీ ఇప్పుడు ఈక్వేషన్స్ మారిపోతున్నాయ్. గణేష్ కూడా పెదవి విప్పుతున్నాడు. హద్దులు మీరి మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా కౌషల్ ఆర్మీకి టార్గెట్ కానున్నాడు. ఎందుకంటే, గణేష్ తన టాలెంట్ అనాలో, లేక ప్రతాపం అనాలో కానీ అదంతా కౌషల్ పైనే చూపిస్తున్నాడు.
వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి అన్నట్లుగా కౌషల్ మాటలకు పెడార్ధాలు తీస్తూ, పక్క దారి పట్టిస్తున్నాడు. దాంతో కౌషల్ ఆర్మీ ఊరుకుంటుందా? సోషల్ మీడియాలో ఆల్రెడీ ఆటాడేసుకోవడం స్టార్ట్ చేసేసింది. అసలే ఈ వారం నామినేషన్స్ లిస్టులో గణేష్ పేరు కూడా ఉంది. గణేష్ తన బిహేవియర్‌ని ఇలాగే కొనసాగిస్తే, పరిణామాలు ఎలా ఉంటాయనేది ఊహించడం కష్టమే.
రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అంటూ బిగ్‌హౌస్‌లో కొనసాగుతూ, తన గేమ్ తాను ఆడుతున్న కౌషల్‌ని ఇరిటేట్ చేస్తున్న గణేష్ భవితవ్యం ఎలా ఉండబోతోందనేది ఆడియన్స్ ఈ వారం తేల్చేస్తారేమో చూడాలిక.