బిగ్ బాస్ టైటిల్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకుని తన ఫోకస్ ఎటువైపు కూడా మళ్ళకుండా ఆట పైనే దృష్టి పెట్టి సాగుతున్న కౌశల్ కి నిన్న పెద్ద ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి.
అదేంటంటే- తనకి బిగ్ బాస్ ఇంటిలో మొదటి రెండు వారాలు నైతిక స్థైర్యం ఇచ్చిన నూతన్ నాయుడు నిన్న అనూహ్యంగా గాయంతో ఇంటి నుండి నిష్క్రమించాడు. అదే సమయంలో నిన్నటి కెప్టెన్సీ టాస్క్ లో కూడా కౌశల్ ఓడిపోవడంతో ఒక్కసారిగా నిరుత్సాహానికి గురయ్యాడు.
అయితే ఈ రెండు ఒకేసారి దాదాపుగా స్వల్ప వ్యవధిలోనే జరగడంతో కౌశల్ కాస్త డౌన్ అయ్యాడనే చెప్పాలి. కాకపోతే ముందునుండి కూడా తాను ఒక్కడినే ఈ ఇంటిలో అందరితో పోరాడుతున్నాను అన్న భావనలో ఉండడం తన పైన తనకి నమ్మకం ఉండటంతో కౌశల్ ఈ రెండు అంశాల నుండి త్వరగా బయటకి వచ్చేస్తాడు అని ఆయన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
చూడాలి మరి.. కౌశల్ మళ్ళీ రొటీన్ లోకి ఎప్పుడు వస్తాడు అనేది...