బిగ్ బాస్ ఇంటిలోకి రీ-ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించిన నూతన్ నాయుడు నిన్న అనూహ్యంగా ఇంటి నుండి నిష్క్రమించాడు.
ఆ వివరాల్లోకి వెళితే, నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా నూతన్ నాయుడు బాల్స్ ని విసురుతుండగా ఆయన కుడి చేతికి సంబందించిన భుజం గాయపడింది. వెంటనే ఆయనని అక్కడ ఉన్న డాక్టర్లు పరిశీలించి ఆసుపత్రిలో చికిత్స అవసరం అని గుర్తించి ఆయనని ఇంటి నుండి తరలించారు.
దీనితో ఆయన రీ-ఎంట్రీ తరువాత ఇంటిలో ఆయన ముందుకన్నా విభిన్నంగా ఉంటూ వచ్చారు. అందరితో కలివిడిగా మాట్లాడుతూ ముఖ్యంగా కౌశల్ కి మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు.
ఇక ఆయన ఇంటి నుండి ఇలా నిష్క్రమించే సరికి ఇంటిలోని అందరికి షో చూస్తున్నవారికి బాధ కలిగించింది.